Extra Jabardasth : బుల్లితెర మీద సూపర్ డూపర్ హిట్టైన కామెడీ షో ‘జబర్దస్త్’. ఈ షోకి వస్తున్న రెస్పాన్స్ కారణంగా ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ పేరుతో మరో ఎపిసోడ్ కూడా జోడించారు. గురువారం ‘జబర్దస్త్’ వస్తే, శుక్రవారం ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ టెలికాస్ట్ అయ్యేది. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర వంటి కమెడియన్లు ఉండడంతో ‘జబర్దస్త్’ కంటే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ప్రోగ్రామ్‌కే అదిరిపోయే టీఆర్పీ వచ్చేది. ‘జబర్దస్త్’కి అనసూయ యాంకర్‌గా ఉంటే, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’కి రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తూ వచ్చింది. అనసూయ తర్వాత ‘జబర్దస్త్’కి చాలామంది యాంకర్లు మారారు. అయితే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ప్రోగ్రామ్‌లో మాత్రం రష్మీ గౌతమ్ యాంకర్‌గా కొనసాగుతూ వస్తోంది. అయితే టీఆర్పీ రోజురోజుకీ తగ్గిపోతూ వస్తుండడంతో ఇక ఈ షోని ఆపేయాలని అనుకుంటోంది మల్లెమాల క్రియేషన్స్..
Prabhas – Prashanth Neel Clashes : సలార్ 2 ఆగిపోయిందా..?
మే 31న ప్రసారమయ్యే ఎపిసోడ్‌తో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ షోకి ఎండ్ కార్డు పడనుంది. ఇకపై కేవలం ‘జబర్దస్త్’ మాత్రమే ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కి కూడా టీఆర్పీ తగ్గుతూ వచ్చింది. అయితే రాకెట్ రాఘవ వంటి కమెడియన్లు మొదటి నుంచి ఈ షోను నమ్ముకుంటూ ఉన్నారు. వారి కోసం ఈ ఒక్క ఎపిసోడ్‌ని మరికొన్ని రోజులు కొనసాగించాలని అనుకుంటోంది మల్లెమాల క్రియేషన్స్..
‘జబర్దస్త్’ షో కారణంగా అంతకుముందు స్టార్ కామెడీ హీరోగా ఉన్న ‘అల్లరి’ నరేష్, హిట్లు లేక వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. ‘జబర్దస్త్’ కామెడీ షోలో పూయించిన కామెడీని సినిమాల్లో రీక్రియేట్ చేయలేకపోవడంతో కామెడీ సినిమాలకు కలెక్షన్లు తగ్గిపోయాయి. అంతేకాకుండా బీపీ, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నవాళ్లు, ‘జబర్దస్త్’ చూడాలంటూ డాక్టర్లు సిఫారసు చేసేవాళ్లు. ఒకానొక సమయంలో ఈటీవీలో మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి… ప్రతీ సమయంలో ‘జబర్దస్త్’ రీ టెలికాస్ట్ అయ్యేది. అంతటి సక్సెస్ అందుకున్న ‘జబర్దస్త్’ ఇప్పుడు వ్యూయర్లు లేక, స్టార్ కమెడియన్లు లేక వెలవెలబోతోంది..