Election Schedule 2024 : లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు నోటీఫికేషన్ విడుదలైంది. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా రాష్ట్రాల్లో మే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి.
543 లోక్సభ స్థానాలకు 7 విడతలుగా పోలింగ్ నిర్వహించబోతున్నట్టుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మొదటి ఫేజ్ ఏప్రిల్ 19న, రెండో ఫేజ్ ఏప్రిల్ 26న, మూడో ఫేజ్ మే 7న, నాలుగో ఫేజ్ మే 13న, ఐదో ఫేజ్ పోలింగ్ మే 20న, ఆరో ఫేజ్ మే 25న, ఆఖరి ఫేజ్ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది..
Pawan Kalyan : పిఠాపురం నుంచి పవన్ పోటీ.. ప్రత్యర్థిగా రామ్ గోపాల్ వర్మ..
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతుంది. భారత్లో ప్రస్తుతం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 ఓవర్ల మంది మహిళలు. 48 వేల మంది అధికారికంగా రిజిస్టర్ చేసుకున్న ట్రాన్స్జెండర్ ఓటర్లు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నోటీఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల అవుతుంది. నామినేషన్లకు ఆఖరి తేదీ ఏప్రిల్ 25 కాగా, నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి ఆఖరి తేదీ ఏప్రిల్ 29.. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఫలితాలు కూడా వస్తాయి.. 85 ఏళ్లు దాటిన వారికి ఈసారి కొత్త ఓట్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ని అమలులోకి తీసుకురానుంది ఎలక్షన్ కమిషన్..