Eagle Review : ఫిబ్రవరిలో విడుదలైన రవితేజ సినిమాలన్నీ కూడా డిజాస్టర్లే! జనవరి 13న విడుదల కావాల్సిన ‘ఈగల్’ మూవీ, ఫిబ్రవరికి వాయిదా పడడంతో ఫ్యాన్స్ ఈ సెంటిమెంట్ విషయంలోనే భయపడ్డారు. అసలే వరుసగా రెండు డిజాస్టర్లు ఫేస్ చేసిన రవితేజ, ‘ఈగల్’ మూవీతో మూడో ఫ్లాప్ ఖాతాలో వేసుకుంటాడా? అని కంగారు పడ్డారు. ఈ వారం పెద్దగా సినిమాలు లేకపోవడంతో రవితేజ ‘ఈగల్’ మూవీకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది… మరి ‘ఈగల్’ పైకి ఎగిరిందా? లేదా?
Indian Students in Abroad : కోటి ఆశలతో విదేశాలకు వెళ్లి, విగతజీవులుగా తిరిగి వస్తూ..
ఓ మారుమూల గ్రామంలో జరిగిన ఊచకోత గురించి విచారణ చేయడానికి క్రైమ్ జర్నలిస్ట్ అనుపమ పరమేశ్వరన్ బయలుదేరుతుంది. ఆ ఏరియాలో దేవుడిగా కొలవబడుతున్న సహదేవ్ వర్మ గురించి ఒక్కో విషయం తెలుసుకుంటూ ఉంటుంది. అతను నిజంగా ఉన్నాడా? లేక కేవలం ఊరి జనాల భ్రమేనా? ఇదే సింపుల్‌గా ‘ఈగల్’ ఫస్టాఫ్.. హీరో గురించి ఎలివేషన్స్ కోసం గట్టి డైలాగులు రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమ్‌నేని..
అయితే ఎలివేషన్ సీన్స్ చూసి, చూసి ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. అందుకే ఫస్టాఫ్ బిలో యావరేజ్‌గా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో యాక్షన్ సీన్స్‌తో నింపేసి, కథకు న్యాయం చేశాడు డైరెక్టర్. సెకండాఫ్‌లో తీసుకున్న కేర్, ఫస్టాఫ్‌లో కాస్త తీసుకుని ఉంటే… ‘ఈగల్’ మరింత బ్లాక్‌బస్టర్‌గా నిలిచేది..
నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?
ఈ మధ్యకాలంలో రవితేజ కెరీర్‌లో బెస్ట్ మూవీ ఇదే. నవ్‌దీప్, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, వినయ్ రాయ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. కొత్తోడైనా మ్యూజిక్ డైరెక్టర్ డవ్‌జంద్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి, ఫస్టాఫ్‌లో స్క్రీన్ ప్లే టైట్ చేసి ఉంటే, ‘ఈగల్’ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచేది..