Drinking Water : నీరు తాగడం మన ఆరోగ్యానికి మంచిది మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా లేదా అనే డౌబ్ట్ చాలామందికి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం..
ఆహారం తీసుకున్న వెంటనే కొందరు ఫుల్గా నీరు తాగేస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్న తర్వాత పరిమితంగానే నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకోవడానికి, నీరు తాగడానికి మధ్య కనీసం అరగంటైనా గ్యాప్ ఉండాలి. ఆహారం తినటానికి కనీసం 40 నిమిషాల ముందు మాత్రమే నీటిని త్రాగాలి. ఆహారం తిన్న తర్వాత నోరు మరియు గొంతును శుభ్రం చేసుకోవటానికి వెచ్చని నీటిని రెండు లేదా మూడు సిప్స్ తీసుకోవచ్చు.
నిజంగా దాహం ఉంటే కనుక.. ఉదయం భోజనం తర్వాత సీజనల్ పండ్ల తాజా రసం మరియు లంచ్ తర్వాత మజ్జిగ తీసుకోవచ్చు. రాత్రి భోజనం తర్వాత పాలను తీసుకోవచ్చు. వీటిలో కూడా ఎక్కువగా నీరు కలిగి ఉన్నప్పటికీ, లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి జీర్ణక్రియల కోసం శరీరానికి సహాయం చేస్తాయని వైద్యులు అంటున్నారు.
నీరు తాగడంలో మరికొన్ని టిప్స్..
* జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడు వేడి వేడి టీ తాగండి.
* ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని త్రాగాలి.
* గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులు చల్లని నీటిని తాగకండి.
* చల్లని నీరు త్రాగటం వలన వివిధ అవయవాలకు రక్త సరఫరా తగ్గుతుంది. తద్వారా గుండెపోటు, కిడ్నీ వైఫల్యం, మెదడు రక్తస్రావం వంటి రోగాలకు దారి తీస్తుంది. అందుకే.. దాహం వేయగానే గ్లాస్ లకు గ్లాస్ ల నీళ్లు తాగడం కాదు.. వాటర్ తాగడం కూడా ఒక ఆర్ట్.