Double Ismart Teaser : పూరీ జగన్నాథ్ తన రేంజ్‌కి తగ్గ సినిమా తీసి చాలా కాలమే అయ్యింది. 2015లో ‘టెంపర్’ మూవీతో హిట్టు కొట్టిన ఈ సక్సెస్ ఇచ్చిన కథ, పూరీది కాదు. వక్కంతం వంశీ కథతో పూరీ జగన్నాథ్ తీసిన సినిమా అది. అంతకుముందు ‘బిజినెస్‌మ్యాన్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘హార్ట్ ఎటాక్’ వంటి సినిమాల్లో పూరీ మార్క్ కనిపించింది. బాలయ్యతో చేసిన ‘పైసా వసూల్’ మూవీ కూడా ఫ్యాన్స్‌కి భలే కిక్కు ఇచ్చింది. ఈ సినిమా నుంచి పూరీకి, హీరోయిన్ ఛార్మికి రిలేషన్ కుదిరింది. అంతే పూరీ జగన్నాథ్ క్రియేటివిటీ అటకెక్కేసింది.
అయితే 2019లో రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ మూవీ తీసి సూపర్ హిట్టు కొట్టాడు పూరీ జగన్నాథ్.. హైదరాబాద్ యాస, ఊర మాస్ కుర్రాడిగా రామ్ పోతినేని యాక్టింగ్, మణిశర్మ అందించిన పాటలు ఈ సినిమాని సూపర్ హిట్టుగా నిలబెట్టాయి.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’ మూవీతో అల్ట్రా డిజాస్టర్ ఫేస్ చేసిన పూరీ జగన్నాథ్, గ్యాప్ తీసుకుని ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశాడు.
Ram Pothineni : చైతూని ఫాలో అవుతున్న Rapo..
ఈ మూవీ టీజర్, రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా మే 15న రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ‘లైగర్’ ఛాయలు బలంగా కనిపిస్తున్నాయి. కథ, కథనం లేకుండా హీరో మ్యానరిజంతో చుట్టేయాలనే ప్రయత్నమే కనిపిస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ సక్సెస్‌కి మణిశర్మ అందించిన బ్లాక్ బస్టర్ సాంగ్స్ ప్రధాన కారణం… కేవలం రామ్ యాస, బాడీ లాంగ్వేజీతో సినిమా ఆడలేదు. అయితే ‘డబుల్ స్మార్ట్’లో ప్రధానంగా దీనిపైనే ఫోకస్ పెట్టినట్టు టీజర్‌లోనే తెలిసిపోతోంది..
పూరీ జగన్నాథ్ క్రియేటివ్ డైరెక్టర్. ‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన దర్శకుడు. అయితే పూరీ టైమ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఉన్న వీ.వీ.వినాయక్ ఇప్పటికే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపులు పడుతున్నా, తన హీరో మేనరిజం పైత్యాన్ని మాత్రం వదలడం లేదు.
టీజర్ హైప్ ఇవ్వలేదు, ట్రైలర్ కూడా ఇలాగే ఉంటే, బజ్ క్రియేట్ కావడం కావడం. అదీకాకుండా ఈ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు పూరీ అండ్ ఛార్మీ.. మరోసారి ‘లైగర్’ రేంజ్ దెబ్బ పడితే పూరీ జగన్నాథ్ కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కష్టం..