Donate For Desh : రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో దేశమంతా తిరుగుతూ, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈ యాత్ర ద్వారా ‘దేశం కోసం’ పేరుతో జనాల దగ్గర్నుంచి విరాళాలు కూడా సేకరిస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ… విరాళాల సేకరణ కోసం క్యూఆర్ కోడ్‌తో పాటు వెబ్‌సైడ్ ద్వారా ఆన్‌లైన్ రూపంలో డబ్బులు వసూలు చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ..
అయితే క్యూఆర్ కోడ్ ముద్రించే విషయంలో జరిగిన పొరపాటు కారణంగా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన సొమ్ము కాస్తా నకిలీ ఖాతాల్లోకి వెళ్లిందట. అలాగే కరపత్రంలో ముద్రించిన వెబ్‌సైట్ కూడా నకిలీ కావడంతో జనాలు, రాహుల్ గాంధీ మీద సానుభూతితో చెల్లించిన సొత్తు అంతా నకిలీ ఖాతాల్లోకి వెళ్లిందట. ఈ విషయాన్ని కాంగ్రెస్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలియచేశాడు. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేసిన స్కామ్ ఆ? లేక అనుకోకుండా జరిగిన పోరపాటా? అనేది తెలియాల్సి ఉంది.
వైరల్ అవుతున్న CFO రింకూ పటేల్ హ్యాండ్ రైటింగ్ రిజైన్ లెటర్.. అందులో ఏముందంటే..
ప్రస్తుతం మణిపూర్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర జరుగుతోంది. ప్రభుత్వ ఆంక్షలతో భారత జోడో న్యాయ యాత్ర వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఈ జోడో యాత్ర ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు..