DJ Tillu2 Heroine : అనుపమ రిస్క్ చేస్తోందా… ‘టిల్లు’ తర్వాత మళ్లీ ‘పరదా’ చుట్టుకుని…

DJ Tillu2 Heroine :‘అ ఆ’ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్‌. కెరీర్ ఆరంభంలోనే రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ వంటి క్రేజీ బ్లాక్ బస్టర్ మూవీలో అనుపమకి చోటు దక్కినా… టెస్టు ఫోటో షూట్ తర్వాత ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. రామ్ పోతినేని, శర్వానంద్, నాని వంటి హీరోలతో నటించిన అనుపమ పరమేశ్వరన్, ‘టిల్లు స్క్వైర్’ మూవీతో ‘అనుపమ 2.0’ వర్షన్‌ని చూపించేసింది…

‘టిల్లు స్క్వైర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.120 కోట్ల వరకూ రాబట్టింది. ఈ సక్సెస్‌లో అనుపమ గ్లామర్ వాటా కూడా బాగానే ఉంది. ‘హనుమాన్’ దర్శకుడు తేజ సజ్జ దర్శకత్వంలో ‘అక్టోపస్’ అనే మూవీ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 65 శాతం పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ తెలియచేసింది కూడా…

ఈ మూవీతో పాటు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ దర్శకత్వంలో ‘పరదా’ అనే మూవీ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. సినిమా కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే ఇది ప్రాచీన భారతీయ సంప్రదాయం గురించి తీస్తున్న సినిమా అని తెలుస్తోంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళలు ముఖం కూడా కనిపించకుండా పరదా కప్పుకుని బయటికి వస్తారు.

ఈ ‘పరదా’ సినిమా హిట్ అయినా, కాకపోయినా వివాదాస్పదం కావడం మాత్రం ఖాయం.. ‘టిల్లు స్క్వైర్’ వంటి గ్లామరస్ హిట్ తర్వాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ, వైవిధ్యం చేయాలనే ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే..

Pawan Kalyan : అవి మనకెందుకంటే, మడిచి పెట్టుకో అన్నాడు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post