మరో 3 రోజుల్లో ‘ధృవ నక్షత్రం’ రిలీజ్.. 10 ఏళ్లు కష్టపడి ప్రమోషన్ లేదు, బజ్ లేదు..

Dhruva Natchathiram : గౌతమ్ మీనన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ధృవ నక్షత్రం’. 2013లో సూర్యతో ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్ట్, కొన్ని కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత రెండేళ్లకు సూర్య ప్లేస్‌లో విక్రమ్‌ వచ్చాడు. 2017లో ‘ధృవ నక్షత్రం’ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.

‘జల్సా’ కోసం మహేష్.. ‘గుంటూరు కారం’ కి తిరిగి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్..

తొలుత సింగిల్ పార్ట్‌గా ‘ధృవ నక్షత్రం’ మూవీని తెరకెక్కించాలని అనుకున్నా, 4 గంటలకు పైగా నిడివి ఉండడంతో రెండు పార్టులుగా మార్చారు. తొలి పార్ట్ ‘ధృవ నక్షత్రం- ఛాప్టర్ 1 యుద్ధ కాండం’ నవంబర్ 24న విడుదల అవుతోంది.

Dhruva Natchathiram

రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ‘ధృవ నక్షత్రం’లో రాధిక, సిమ్రాన్, పార్థిబన్ ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్‌కి 3 రోజుల సమయం మాత్రమే ఉన్నా, హీరో విక్రమ్ మాత్రం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ‘ధృవ నక్షత్రం’ మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కి, హీరో విక్రమ్‌కి వచ్చిన మనస్పర్థలే దీనికి కారణమని తెలుస్తోంది.

ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..

విక్రమ్ ప్రస్తుతం ‘తంగలాన్’ అనే మూవీ చేస్తున్నాడు. 2024, జనవరి 26న విడుదలవుతున్న ఈ సినిమాని తెలుగులో కూడా ప్రమోట్ చేస్తున్న విక్రమ్, ‘ధృవ నక్షత్రం’ సినిమాని మాత్రం పట్టించుకోవడం లేదు.

దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘ధృవ నక్షత్రం’ సినిమా, ఈ వారం విడుదల అవుతుందనే విషయమే చాలా మందికి తెలీదు. ప్రమోషన్ కార్యక్రమాలు లేవు, బజ్ లేదు, క్రేజ్ కూడా లేదు. బీభత్సమైన పాజిటివ్ టాక్ వచ్చినా, బజ్ క్రియేట్ అయ్యి థియేటర్లకు జనాలు వెళ్లడం కష్టమే. విక్రమ్ కెరీర్‌లో మరో ఫ్లాప్ చేరినట్టే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post