Dhanush Kubera : అండర్ వరల్డ్‌ని శాసించే బిక్షగాడి కథతో కుబేరా..

Dhanush Kubera :‘ఆనంద్’, ‘హ్యాపీడేస్’ వంటి క్లాస్ హిట్స్ తీసిన శేఖర్ కమ్ముల, రానా దగ్గుపాటిని హీరోగా పరిచయం చేస్తూ ‘లీడర్’ మూవీ చేశాడు. క్యూట్ లవ్ స్టోరీ ‘ఫిదా’ మూవీతో వరుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందించిన శేఖర్, నాగచైతన్యకి కూడా ‘లవ్ స్టోరీ’ రూపంలో హిట్టు ఇచ్చాడు. తెలుగులో శేఖర్ కమ్ములతో పని చేయడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నా, కోలీవుడ్ హీరో ధనుష్‌తో తర్వాతి సినిమా చేయబోతున్నాడు..

Pushpa 2 Exclusive Update : రెస్ట్ లేదా పుష్ప..

ధనుష్‌, శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న మూవీకి ‘కుబేర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో ధనుష్ ఓ బిచ్చగాడిగా కనిపిస్తాడు. అయితే చూడడానికి బిచ్చగాడే అయినా అతని కనుసన్నల్లోనే మాఫియా వరల్డ్ మొత్తం ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ధనుష్ కళ్లల్లో కనిపించే దర్పం అందుకేనట. కనిపించకుండా మాఫియా ప్రపంచాన్ని శాసిస్తున్న ‘కుబేర’ కోసం వెతికే పోలీస్ అధికారిగా అక్కినేని నాగార్జున నటిస్తున్నాడట.

కథ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, ఇంతకుముందు ఇంచుమించు ఇలాంటి కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి కూడా. అయితే శేఖర్ కమ్ముల టేకింగ్, సాధారణ సినిమాని కూడా క్లాసిక్‌గా మారుస్తుంది. మరి ధనుష్ కెరీర్‌లో ఈ కుబేర మూవీకి ఎలాంటి స్థానం దక్కుతుందో చూడాలి. ప్రస్తుతం ధనుష్ ‘రాయన్’ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి డైరెక్టర్ కూడా ధనుషే. కాబట్టి కుబేరుడి రాక 2025లో ఉంటుంది.

TSRTC free bus Effect : ఫ్రీ బస్సు తెచ్చిన తంటా.. 3 రోజులుగా తిండి తిప్పలు మానేసి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post