‘డెవిల్’ రిలీజ్‌కి ముందు ‘డైరెక్టర్’ గొడవ.. నేనంటే నేనేనంటూ..

Devil Movie Controversy : సాధారణంగా సినిమాల రిలీజ్‌ల ముందు ఫైనాన్షియల్ వివాదాలు, కాపీ రైట్ గొడవలు సహసం. అయితే కళ్యాణ్‌రామ్ ‘డెవిల్’ విషయంలో మాత్రం డైరెక్టర్ ఎవరనే విషయంలో గొడవ జరుగుతోంది. డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ మూవీని అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు నవీన్ మేడారం దర్శకుడిగా పోస్టర్‌లో చూపించారు. ‘బింబిసార’ వంటి హిట్టు తర్వాత ‘డెవిల్’ పోస్టర్ రావడంతో ఉత్కంఠ రేగింది.

ఫ్లాప్ హీరోలకి హిట్టు దేవతగా మారిన శ్రుతి హాసన్.. ఆఖరికి ప్రభాస్‌కి కూడా..

అయితే కొన్నాళ్ల తర్వాత పోస్టర్లలో దర్శకుడి పేరు మాయమైంది. టీజర్‌లో ‘ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్’ అని రాగా, ట్రైలర్ సమయానికి వచ్చేసరికి ‘డైరెక్టర్ అభిషేక్ నామా’ అంటూ నిర్మాతే, దర్శకుడిగా మారినట్టుగా టైటిల్ కార్డ్స్‌లో కనిపించింది.

సినిమా రిలీజ్‌కి ముందు నవీన్ మేడారం, ఈ సినిమాని తానే 105 రోజుల పాటు చిత్రీకరించారని, ఈ సినిమా కథ కోసం, పాత్రల డ్రెస్సింగ్ కోసం మూడేళ్లు కష్టపడ్డానంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో రచ్చ రేగింది. అయితే అభిషేక్ నామా మాత్రం తానే స్వయంగా డైరెక్ట్ చేశానని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాకి ఎక్కడంతో అభిషేక్ నామాపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. దీంతో అభిషేక్ నామా, ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు.

నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?

‘డెవిల్’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే డైరెక్టర్ గొడవ మరింత తీవ్రతరం అవుతుంది. ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నవీన్ మేడారంకి సానుభూతి దక్కి, తానే దర్శకుడిని అని చెప్పుకున్న అభిషేక్ నామా మరిన్ని ట్రోల్స్ ఫేస్ చేయక తప్పదు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post