Devara Vs Vettaiyan : ఎన్టీఆర్‌తో పోటీకి రజినీ సై..

Devara Vs Vettaiyan : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఏకంగా 6 నెలలు వాయిదా పడింది. అక్టోబర్ 10న ‘దేవర పార్ట్ 1’ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టుగా మార్చిలో ప్రకటించింది చిత్ర యూనిట్. టీజర్‌తో పాటు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అక్టోబర్ 10 గురువారం, దుర్గాష్టమి కాగా ఆ తర్వాత మహా నవమి, విజయ దశమి ఇలా వరుసగా హాలీడేస్ ఉన్నాయి. దీంతో పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం.

అయితే ఎన్టీఆర్‌‌కి పోటీగా సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తున్నాడు. ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న ‘వెట్టైయన్’ సినిమా కూడా అక్టోబర్ 10నే థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సూపర్ స్టార్ సినిమా అంటే ఇండియా మొత్తం బీభత్సమైన క్రేజ్ ఉంటుంది. ‘వెట్టైయన్’ మూవీ తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. దీంతో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

Jr NTR : 19 ఏళ్లకే రజినీకాంత్‌ని భయపెట్టిన ఎన్టీఆర్ క్రేజ్! తారక్ ఎందుకు ఇంత స్పెషల్..

అటు ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి, ఇటు రజినీ ‘వెట్టైయన్’ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రనే. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి అయితే ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాల పోటీ ఫిక్స్ అవ్వడం ఖాయం. సెప్టెంబర్ మూడో వారంలో పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా కూడా ఉంది. అక్టోబర్ మూడో వారంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఉంది. కాబట్టి ‘దేవర’ మూవీని ముందుకీ, వెనక్కి తీసుకెళ్లలేని పరిస్థితి. మరి ఈ రెండు సినిమాల్లో ఎవ్వరైనా తగ్గి, డేట్ మారుస్తారా? లేక ఒకే రోజు వస్తారా? అనేది చూడాలి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post