DEVARA MOVIE UPDATE : సైఫ్ ఆలీ ఖాన్‌కి గాయం! సర్జరీ కూడా… 2 నెలల్లో ‘దేవర’ వచ్చేనా?

DEVARA Movie Update : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ ‘దేవర’. రెండు పార్టులుగా విడుదలయ్యే ఈ సినిమా తొలి పార్ట్‌ని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ‘దేవర’ ఏప్రిల్‌లో వచ్చే అవకాశమే లేదని టాక్ వినబడుతోంది. ఏప్రిల్‌లో ఏపీ ఎలక్షన్స్ ఉంటాయి. అలాగే లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ‘దేవర’ రిలీజ్ డేట్‌పై డౌట్స్ మొదలయ్యాయి.

Samantha :  అతన్ని గుడ్డిగా నమ్మి, మోసపోయా! సమంత కామెంట్స్ ఎవరి గురించి…?

దీనికి తోడు తాజాగా ‘దేవర’ మూవీలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చేరాడట. సైఫ్ ఆలీ ఖాన్ భుజానికి శస్త్ర చికిత్స చేయాల్సిందేనని వైద్యులు తేల్చేశారని సమాచారం. దీంతో సైఫ్ మరో నెల రోజుల పాటు షూటింగ్ స్పాట్‌కి రావడం కూడా కష్టమే… సైఫ్ కారణంగా ప్రస్తుతానికి ‘దేవర’ షూటింగ్‌కి బ్రేక్ పడింది..

వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా బాకీ ఉండడంతో ‘దేవర’ వచ్చే జూన్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినబడుతోంది. అయితే సైఫ్ త్వరగా కోలుకుని, ఎన్నికలు మార్చిలోనే పూర్తి అయితే కనుక, అనుకున్న సమయానికి ‘దేవర’ మూవీని థియేటర్లలోకి తేవాలని అనుకుంటున్నారట చిత్ర యూనిట్.. చెప్పిన సమయానికి ఒక్క నిమిషం అటు ఇటూ కాకుండా గ్లిప్స్ విడుదల చేసిన ‘దేవర’ టీమ్, సినిమాని థియేటర్లలోకి తీసుకురావడంలో టైమ్ మిస్ కాకుండా చూసుకుంటే.. సగం సక్సెస్ సాధించినట్టే..

Readmore :Jr NTR Vs Balakrishna

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post