Darling Trailer Review : ‘బలగం’ సినిమా తర్వాత ప్రియదర్శికి మార్కెట్ పెరిగింది. ‘మంగళవారం’ సినిమాతో మరో హిట్టు కొట్టిన ప్రియదర్శి, ప్రస్తుతం నభా నటేశ్‌తో ‘డార్లింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘వై దిస్ కొలవెరి’ అనేది దీనికి ఉప శీర్షిక. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 19న విడుదల అవుతోంది. తాజాగా ‘డార్లింగ్’ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. చిన్నతనం నుంచి ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని, పారిస్ వెళ్లాలని కలలు కనే హీరో, అనుకోకుండా తనకు పరిచయమైన ఆనందిని పెళ్లి చేసుకున్నాడు.
మొదటి రాత్రి రోజు ఆమె వింతగా ప్రవర్తించడం చూసి షాక్ అవుతాడు. ప్రేమగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తూ, మూతి పగలకొడుతుంది ఆనంది. ఆమె ఎందుకు ఇలా చేసిందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, తనకి ‘అపరిచితుడు’ సినిమాలో లాగ స్పిల్ట్ పర్సనాలిటీ ఉందని తెలుస్తుంది. మరి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని భార్యతో హీరో ఎలాంటి కష్టాలు పడ్డాడో అదే ‘డార్లింగ్’ సినిమా..
Prabhas : రాముడు చేయలేకపోయిన పనిని, కర్ణుడు చేశాడు..
ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా కట్ చేసి, సినిమాపైన అంచనాలు పెంచడంలో డైరెక్టర్ అశ్విన్ రామ్ బాగా సక్సెస్ అయ్యాడు. నభా నటేశ్‌తో పాటు బ్రహ్మానందం, అనన్య నాగిళ్ల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.