Darling Movie Review : ప్రియదర్శి హీరోగా వచ్చిన సినిమాలు అన్నీ హిట్లే. ‘బలగం’ తర్వాత ప్రియదర్శి నటించిన ఫుల్ లెంగ్త్ మూవీ ‘డార్లింగ్’. ఇంతకుముందు ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా ‘డార్లింగ్’ అనే సినిమా వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇదో ఆల్ టైం ఫెవరెట్. అలాంటి సినిమా పేరుతో ప్రియదర్శి తీసిన ప్రయత్నం వర్కవుట్ అయ్యిందా?
హీరోకి పెళ్లి చేసుకుని, భార్యతో కలిసి హానీమూన్‌కి పారిస్ వెళ్లాలనేది కల. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక పెళ్లి కూతురు వేరే వాడితో లేచిపోయింది. పెళ్లి ఆగిపోవడంతో అందరూ చూసి నవ్వుతున్నారని బాధతో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతన్ని హీరోయిన్ కాపాడుతుంది.
Anudeep KV : నెక్ట్స్ మూవీ ఎవరితో..
పరిచయమైన కొన్ని గంటల్లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ నైట్ రోజు తన మరో రూపం చూపిస్తుంది హీరోయిన్.. ఆమెలోని వేరియేషన్స్ భయపడిన హీరో, భార్యకు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమెకు మల్టీపర్సనాలిటీ డిజార్డర్ ఉందని తెలుస్తుంది. ఆమెతో హీరో పడిన కష్టాలే ‘డార్లింగ్’..
తెలుగువాళ్లకు మల్టీపర్సనాలిటీ డిజార్డర్ అంటే ‘అపరిచితుడు’ గుర్తుకు వస్తది. అలాగే ప్రశాంత్ వర్మ ‘అ!’ మూవీ కూడా ఇదే కథాంశంతో తెరకెక్కింది. ఈ పాయింట్‌తో కొన్ని కామెడీ ట్రాక్స్ నడిచాయి. కానీ ఇందులో సబ్జెక్ట్ అటు సీరియస్ కాకుండా ఇటు కామెడీ కాకుండా తయారు కావడంతో ప్రేక్షకులు అసహనానికి గురి అవుతారు..
Awe Movie : హనుమాన్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ‘అ!’ చూశారా? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ బ్రిలియెన్స్..
హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ దాకా బాగున్న సినిమా, సెకండాఫ్ నుంచి సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించేసుకుంటూ ఉంటారు. డైరెక్టర్ అశ్విన్ రామ్ అనుభవలేమి కనిపిస్తుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ బాగుంది. కానీ సినిమాని పూర్తిగా గట్టెక్కించలేకపోయింది.