Dangerous Media : ఒకప్పుడు మీడియా అంటే వేళ్ళ మీద లెక్కపెట్ట గల న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానెల్స్ ఉండేవి. చాలా న్యూస్ పేపర్స్ అంతరించుకుకపోయినా ఉన్నవాటిలో ఎథిక్స్ (Ethics) ఉన్నవి చాలా తక్కువ అని చెప్పొచ్చు.
ఈ డిజిటల్ యుగంలో అరచేతిలోనే న్యూస్, అరచేతిలోనే ప్రపంచం. ఇప్పుడు న్యూస్ లో న్యూస్ కన్నా.. న్యూ సెన్స్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ప్రేక్షకాదరణ వల్లే సాధ్యమైంది. అయితే ఈ ప్రభావం మనుషులని మానసికంగా దెబ్బ తీస్తుంది.
యువతపై చెడు ప్రభావం :
టీవీ మరియు సోషల్ వెబ్‌సైట్‌లలో ఏది చూసినా నమ్మేలా యువతపై మీడియా చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా చెడు అలవాట్ల ఉచ్చులో పడి ఆ వ్యసనాన్ని విడిచిపెట్టడం కష్టమవుతుంది. మితిమీరిన అడల్ట్ కంటెంట్ యువత మనస్సులో కూడా చాలా సమస్యలకు కారణం అవుతుంది.
ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం :
మీడియా లివ్ వార్తలను అందించాలని చూస్తుంది. ‘నిజం’ అన్ని మీడియా సంస్థలు తమ కథనంలో పక్షపాత ధోరణి కలిగి ఉంటాయి. వివిధ పార్టీలకు విధేయత కారణంగా, ప్రజలు నిజనిజాల్లో ఒక వైపు మాత్రమే బహిర్గతం అవుతుంది.
మీడియా (Dangerous Media)ప్రపంచవ్యాప్తంగా అనేక సామాజిక తిరుగుబాట్లకు కారణమైంది. ఫలితంగా రాజకీయ గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం ఎవరు ఎలాంటివారో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది.
ప్రేక్షకుల మనస్తత్వాన్ని తారుమారు చేయడం ప్రమాదకరమైన మార్పు అని చెప్పాలి. మీడియా రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. ఎందుకంటే అది ఒక చేతిని సరిగ్గా ఉపయోగిస్తే, అది సమాజానికి ఒక వరం అని నిరూపించగలదు.
మరొక వైపు అది సామాజిక మరణ మృదంగం తలపిస్తుంది. ఇవి మీడియాకు సంబంధించిన కొన్ని సానుకూల మరియు ప్రతికూల అంశాలు.
Note : ఎవరినీ ఉద్దేశించి రాయడం మా ఉద్దేశం కాదు..
Indian Serials : మీకు తెలుసా సీరియల్స్ ఆరోగ్యానికి హానికరం అని.. తెలీదా అయితే తెలుసుకోండి..!?