Congress Rythu Bandhu : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రైతు భరోసా కింద ఎకరాకి రూ.15 వేలు ఇస్తామనే హామీ కూడా ఓ కారణం. బీఆర్‌ఎస్ రూ.4 వేలు వేస్తుంటే, కాంగ్రెస్ ఏకంగా రూ.15 వేలు ఇస్తామని చెప్పడంతో గ్రామీణ ప్రాంత రైతులంతా అటు వైపు మళ్లారు.
ఎకరాకి రూ.15 వేలు అన్నారు! ఒక్క రూపాయి వేశారు… రైతు బంధు ఇక ‘బంద్’యేనా..
ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాస్ట్ కట్టింగ్ కోసం చేయాల్సిన పనులు చేస్తోంది. బీఆర్‌ఎస్ హయంలో 200 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా రైతు బంధు కింద ఆర్థిక సాయాన్ని పొందారు. ఇది కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తం అయినా, రైతు బంధుకి భూపరిమితి తెచ్చే ఆలోచన చేయలేదు బీఆర్‌ఎస్..
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూపరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా కింద డబ్బులు చెల్లిస్తామని అంటోంది. అయితే రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ అందుకోవడానికి అర్హత ఉండదని తేల్చేసింది. రైతు బంధు కింద డబ్బులు పొందుతున్న రైతుల్లో రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా అందుతుంది.
దేశానికి రాజు, వెన్నుముక “రైతు”..
రైతు భరోసా కోసం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ పొందుతున్నవాళ్లు మాత్రం మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. రేషన్ కార్డు ఉన్నవారికే రైతు భరోసా అమలు చేస్తే, ప్రభుత్వ ఖర్చు దాదాపు 40 తగ్గుతుంది.