దాల్చిన చెక్క ఉపయోగాలు..

Cinnamon Benefits : మన వంటగదిలో ఉండే మసాలా దినుసులలో అనేక ఔషధ గుణాలున్నాయి. వీటిని సరిగా ఉపయోగిస్తే అనేక వ్యాధులను.. మనకు మనమే నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి మసాలా దినుసుల్లో ఒకటు దాల్చిన చెక్క. చెట్టు బెరడు నుంచి వచ్చే దాల్చిన చెక్క.. సువాసన వెదజల్లడమే కాదు.. వంటల్లో ఇది హాట్ స్పైస్ కూడా.. అయితే దాల్చిన చెక్కను ఎలా తీసుకుంటే ఫలితం ఉంటుంది.. ఏయే జబ్బులకు ఔషధంగా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం..

మెంతాకుతో మహిళలకు ఎంతో మేలు..

గుండె జబ్బులు : దాల్చిన చెక్కను పొడిగా చేసుకున్న తర్వాత తేనె కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసుకుని తీసుకోవాలి. రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్ లో జెల్లీ, జామ్‌ బదులుగా దీన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఒకవేళ మీకు ఇప్పటికే హార్ట్‌ఎటాక్‌ ఒకసారి వచ్చి ఉంటే మరోసారి రాకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్క, తేనెను తీసుకోవడం వల్ల హార్ట్‌బీట్‌ కూడా మెరుగవుతుంది.

ఆర్థరైటిస్‌ : రెండు టేబుల్‌స్పూన్ల తేనె, ఒక చిన్న టీ స్పూన్‌ దాల్చిన చెక్కపొడిని కప్పు వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజూ తీసుకుంటే క్రానిక్‌ ఆర్థరైటిస్‌ సమస్య కూడా నయమవుతుంది.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు : రెండు టేబుల్‌స్పూన్ల దాల్చినచెక్కపొడి, ఒక టీస్పూన్‌ తేనెను గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

కొలెస్ట్రాల్ : రెండు టేబుల్‌స్పూన్ల తేనె, మూడు టీస్పూన్ల దాల్చిన చెక్కపొడిని 16 ఔన్సుల టీ వాటర్‌తో కలిపి కొలెస్ట్రాల్ పేషెంట్స్‌ తీసుకోవాలి. ఇలా చేస్తే రెండు గంటల్లోగా 10 శాతం కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
జలుబు : సాధారణ జలుబు లేక తీవ్రమైన జలుబుతో బాధపడుతుంటే.. ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, పావు చెంచా దాల్చినచెక్క పొడిని రోజుకొకసారి మూడురోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, సైనస్‌ సమస్యలు దూరమవుతాయి.

మీ మెడ మెరిసిపోవాలి అంటే ఇలా చేయండి..

కడుపునొప్పి : దాల్చిన చెక్కను తేనె కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అల్సర్‌ సమస్య కూడా నయమవుతుంది.
ఇన్‌ఫ్లూయెంజా : తేనెలో ఉన్న సహజ సిద్ధగుణాలు ఇన్‌ఫ్లూయెంజా జెర్మ్స్‌ని చంపేసి ఫ్లూ నుంచి కాపాడతాయి.
గొంతు నొప్పి : గొంతులో కిచ్‌ కిచ్‌గా ఉంటే ఒక టేబుల్‌స్పూన్‌ తేనె తీసుకోవాలి. ప్రతీ మూడు గంటలకొకసారి తీసుకుంటూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు త్వరగా దూరమవుతాయి.

మొటిమలు : మూడు టేబుల్‌స్పూన్ల తేనె, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని పేస్టు మాదిరిగా చేసుకుని పడుకునే ముందు ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమలు మటుమాయమవుతాయి.
వెయిట్‌లాస్‌ : రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కంటే అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించి తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు.

ఈ చారుతో జలుబు మాయం..

నోటి దుర్వాసన : ఒక టీ స్పూన్‌ తేనె, దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చటి నీళ్లలో వేసుకుని పుక్కిలిస్తే ఆ రోజంతా నోటి సువాసన నుంచి తాజాదనాన్నిస్తుంది.
అలసట : అర టేబుల్‌ స్పూన్‌ తేనెను గ్లాసు నీటిలో కలుపుకుని కొంచెం దాల్చిన చెక్కపొడిని అందులో వేసుకుని తాగితే అలసట దూరమవుతుంది. ముఖ్యంగా సీనియర్‌ సిజిజన్స్‌కు ఇది బాగా ఉపకరిస్తుంది.

రోగనిరోధక శక్తి : రోజూ క్రమం తప్పకుండా దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.
చర్మ వ్యాధులు : తేనె, దాల్చినచెక్క పొడిని సమానంగా తీసుకుని సమస్య ఉన్న చోట పూస్తే ఎగ్జిమా, రింగ్‌వార్మ్స్‌, ఇతర స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post