Chiranjeevi – Savitri : తెలుగు తెర మీద సావిత్రి చేసిన నట సంతకం అజరామరం. ‘మాయబజార్’ సినిమాలో శశిరేఖగా అమాయకత్వాన్ని, ఘటోత్కచుడిగా గాంభీర్యాన్ని పలికించారు సావిత్రి(savitri). ఎంతోమంది ఆమె నటను ఇమిటేట్ చేయాలని ప్రయత్నించినా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ నటుల్లో సావిత్రి ఒకరు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), సావిత్రితో రెండు సినిమాల్లో నటించారు..
‘నా మొదటి సినిమాతోనే మహానటి సావిత్రిగారితో నటించే అదృష్టం దక్కింది. సినిమా మొదలయ్యేదాకా ఈ విషయాన్ని నాకు ఎవ్వరూ చెప్పలేదు. షూటింగ్ మొదలయ్యాక నువ్వు ఎవరితో కలిసి నటిస్తున్నావో తెలుసా? అన్నారు. తెలీదు అన్నాను. మహానటి సావిత్రి గారితో చేస్తున్నావని అన్నారు. ఒక్కసారిగా షాక్ అయ్యాను. పరిచయం చేస్తామని చెప్పి తీసుకెళ్లారు..
Samantha, Savitri, Silk Smitha : వాడుకుని వదిలేస్తుందా ఫిల్మ్ ఇండస్ట్రీ..!?
సావిత్రిగారిని చూడగానే నోట మాట రాలేదు. మా నాన్నగారు కూడా సావిత్రికి అభిమాని. అప్పుడే శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారాను. రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంటే వర్షం వచ్చింది. ఓ ఇంట్లో సెట్ వేసి, షూట్ చేస్తున్నారు. ఆ రోజు రోజారమణి, కవిత, తదితరులు ఉన్నారు. వర్షం ఆగకపోవడంతో నన్ను డ్యాన్స్ చేయమని చెప్పారు..
నన్ను అడగ్గానే టేప్ రికార్డులో ఇంగ్లీష్ పాట పెట్టి డ్యాన్స్ చేయడం మొదలెట్టాను. జల్లులకు కాలు జారి పడిపోయాను. పడినవాడిని ఉండకుండా నాగుపాములా ఫ్లోర్ స్టెప్పు వేశాను. అందరూ క్లాప్స్ కొట్టాను. నచ్చావయ్యా.. పడిన కూడా సిగ్గుపడకుండా మళ్లీ చేశావ్ చూడు.. చాలా పైకి వస్తావని దీవించారు. ఆ తర్వాత ప్రేమతరంగాలు సినిమాలో సావిత్రికి కొడుకుగా నటించాను.. ఆ సినిమాలో కృష్ణంరాజు, సుజాత, జయసుధ నటించాం.. ’ అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి..