Chiranjeevi : నందమూరి వారసుడు బాలకృష్ణ, అక్కినేని వారసుడు నాగార్జున, దగ్గుపాటి వారసుడు వెంకటేశ్ ఈ ముగ్గురినీ కాదని సొంత కష్టం మీద వచ్చి టాప్ హీరోగా ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి. అల్లు రామలింగయ్యకి అల్లుడిగా మారినప్పటికీ అంతకుముందే చిరంజీవికి మంచి పాపులారిటీ, క్రేజ్ వచ్చాయి.. అయితే చిరంజీవి ఊరికే సుప్రీం హీరో, మెగాస్టార్ అయిపోలేదు. దాని వెనక చాలా అవమానాలే ఉన్నాయి.
‘నేను, శారద గారిలో ఓ సినిమా చేస్తున్నాను. ఆ మూవీలో కోర్ట్ సీన్ షూటింగ్ చేస్తున్నాం. షూటింగ్ టైమ్‌కి ముందు నేను బయట నించున్నా. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నన్ను పిలిచాడు. నేను వచ్చి, నా సీన్ కోసం బోన్‌లో నిల్చున్నాను. నిర్మాత క్రాంతి కుమార్‌కి చాలా కోపం వచ్చేసింది. ‘‘ఏంటండీ మిమ్మల్ని కూడా పిలవాలా? వచ్చి ఈడ పడి ఉండలేరా మీరు? మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా? ఉండండి.. పెద్ద పెద్ద యాక్టర్లు లేరా? జగ్గయ్య గారు, శారద గారు… ’’ అన్నాడు..
Poonam Kaur : ఇండస్ట్రీలో గురుజీ అంటే ఆయనకొక్కడే! స్క్రిప్ట్‌లు హైజాక్ చేసేవాడు గురూజీ కాదు..
ఆ మాటలు విని, నాకు గుండె పిండేసినట్టు అయిపోయింది. అందులో నా తప్పేముంది. నేను ఫ్లోర్ బయటే ఉన్నాను, పిలవగానే వచ్చాను. ఆయన అరుపులు అందరికీ వినబడ్డాయి. ఆ రోజు భోజనం చేయలేదు. సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత నా ల్యాండ్ ఫోన్‌కి కాల్ వచ్చింది. నేనయ్యా క్రాంతి కుమార్‌ని మాట్లాడుతున్నాను అన్నారు. నేను చెప్పండి సార్ అన్నాను..
ఏం లేదయ్యా శారద.. కాస్త మతిమరుపు పెరగడం వల్లేనేమో చాలా టేకుల మీద టేకులు తీసుకుంటోందని అన్నారు. ఆయన స్ట్రెస్‌లో ఇలా చేశానని చెప్పారు. కానీ అది కాదు విధానం. ఆయన అన్న మాటల్లో నాకు ‘‘నువ్వేమైనా సూపర్ స్టార్’’ అనుకున్నావా? అనే మాట మాత్రమే బలంగా కొట్టింది. ఎస్.. నేను సూపర్ స్టార్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. అందుకే నాపై వచ్చే ట్రోలింగ్‌ని నేను అస్సలు పట్టించుకోను. నేను ఇలాంటివి ఎన్నో చూశాను. ఈ పొజిషన్‌కి రావడానికి ఎంత కష్టపడ్డానో నాకు బాగా తెలుసు..’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి..