Chiranjeevi Gharana Mogudu : హీరోల వారసులను వెనక్కి నెట్టి, చిరంజీవి.. ఎన్టీ రామారావు తర్వాత నెం.1 హీరోగా ఎదిగాడు. రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ నెం.1 హీరో స్టేటస్ అనుభవించాడు. మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ కారణం ఆయనలోని కామెడీ టైమింగ్, హ్యూమర్ కూడా. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఘరానా మొగుడు’ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో రాజు పాత్రలో చిరంజీవి మేనరిజం, మాస్ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.
‘నిజానికి ఘరానా మొగుడు సినిమాలో కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి డైలాగ్ బాగా క్లిక్ అయ్యింది. రావుగోపాల రావుని ఆసుపత్రిలో కలిసే సమయంలో ఇలా సగం వంగి నమస్తే పెడతాడు. నిజానికి డైరెక్టర్ అలా చెప్పలేదు. రాసిమూసి నరసింహారావుగారని ఒకాయాన ఉండేవాడు. ఆయన ఇలా సగం వంగి, ముందు షర్టు పట్టుకుని నమస్తే పెట్టేవాడు. అది బాగా తమాషాగా ఉండేది. దాన్ని వాడదాం, కానీ ముందు పట్టుకోకుండా చేతి వెనక్కి పెట్టుకుందాం అని ట్రై చేశాను..
Why Do Movies Release On Fridays : శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తారో తెలుసా..!?
రావుగోపాల్ రావుగారు పని అయ్యిందా? అని అడిగితే గాడిది గుడ్డు అయ్యింది అంటాను. ఆ తర్వాత కాస్త ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి అని ఉంటుంది. వేరే సినిమా కోసం బుర్రా కేవ్స్‌కి వెళ్లినప్పుడు మేం లోపల లంచ్ చేస్తున్నాం. ఎవరో ఒకతను బాసూ.. అని అరిచారు. నేను ఇలా తిరిగాను.. బాసు.. లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో బాసు అన్నారు.. దాన్ని అప్పటికప్పుడు రావుగోపాల్ రావు గారి సీన్ దగ్గర వాడాం.. డైరెక్టర్ గారు భలే ఉందే అని సినిమాలో హీరోకి మేనరిజంగా వాడేశారు..’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి..