Chandra Babu Vs Jagan : ఐదేళ్లలో ఎవరి పాలనకి పడిన మార్కులెన్ని?

Chandra Babu Vs Jagan : జగన్ సర్కారు ఐదేళ్లు పూర్తి చేసుకుంది. మే 13న జరిగే ఎన్నికలు జరగబోతున్నాయి. మరి జగన్ సర్కార్ తెచ్చుకున్న మార్కులెన్ని? విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడింటికే మొదటి ప్రాధాన్యత అంటూ ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చింది జగన్ సర్కార్. మళ్లీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి అదే విద్య, వైద్యం, వ్యవసాయం పేరుతో ఆర్భాటపు ప్రచారం చేసుకుంటోంది.

జగన్ ఈ ఐదేళ్లలో సంక్షేమంతో పాటు ఈ మూడు రంగాల్లో చేసింది ఇదే..

విద్య, వైద్యం, వ్యవసాయం.. ఈ మూడింటిలో వైద్య విభాగం ఒక్కటే, జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అంశం. వైద్య రంగంలో ఖాళీగా ఉనన వైద్యుల భర్తీ, ఉద్దానం పరిష్కారం చేశాడు. మిగిలిన విషయాల్లో చెప్పుకోదగ్గ పనులేమీ జరగలేదు.

YS Jagan : జగన్ చెప్పిందెన్ని? చేసిందెన్ని?

మెడికల్ కాలేజీలు పరంగా చూస్తే చంద్రబాబు హయాంలో 3 ప్రభుత్వ కాలేజీలు, 5 ప్రైవేట్ కాలేజ్ నిర్మితమయ్యాయి. జగన్ హయాంలో మాత్రం 5 కాలేజీలు నిర్మించారు. అవి కూడా ఎయిడెడ్ కావడంతో ప్రైవేట్ ఫీజులే వసూలు చేశారు.

పింఛన్లు లబ్ధి, చంద్రబాబు హయాంలో 30 లక్షల నుంచి 54 లక్షల మందికి 200 నుంచి 2 వేలు వరకు అందింది.. జగన్ హయాంలో మాత్రం 54 లక్షల నుంచి 65 లక్షల మందికి 2వేల నుంచి 3 వేలు వరకు లబ్ధి చేకూరింది.. లబ్దిదారుల సంఖ్యతో పాటు వారికి ఇచ్చిన సాయం కూడా భారీగా పెంచారు.

విద్యాదీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) చంద్రబాబు హయాంలో 11 లక్షల విద్యార్థులకు అందితే జగన్ హయాంలో 9.86 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూరింది.. ఫీజు రీయింబర్స్‌మెంట్, నేరుగా విద్యార్థుల ఖాతాల్లో పడేలా చేసిన మార్పు, చాలా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది.

చంద్రబాబు హయాంలో టిడ్కో కాకుండా కట్టిన ఇళ్ళు 6 లక్షలు,
జగన్ హయాంలో కట్టిన ఇళ్ళు 5 లక్షలు..

YS Jagan : జగన్‌కి ఓటమి తప్పదా? ఏపీలో పరిస్థితి ఎలా ఉంది..

ప్రభుత్వ పాఠాశాలల్లో అడ్మిషన్లు :
చంద్రబాబు హయాంలో (2018-19) 37.2 లక్షలు,
జగన్ హయాంలో (2023-24) 37.8 లక్షలు..

పాలిటెక్నిక్ కాలేజీల్లో 42 వేల నుంచి 35 వేలు అడ్మిషన్లు, డిగ్రీలో 2.4 లక్షల నుంచి 1.4 లక్షల అడ్మిషన్లు జరిగాయి.

సాగు విస్తీర్ణంలో బాబు హయాంలో (2018-19) 58.8 లక్షల ఎకరాలకి సాగు నీరు అందితే, జగన్ హయాంలో (2022-23) 58.4 లక్షలకు అందింది. ఈ సంవత్సరం ఇంకా తగ్గింది. చంద్రబాబు హయాంలో పూర్తి చేసిన జలప్రాజెక్టులు 19, అయితే జగన్ హయాంలో కేవలం 5 మాత్రమే.

Related Post