Chakram Movie Re Release : ఈ రీ-రిలీజ్‌లకు బ్రేక్ ఎప్పుడో..

Chakram Movie Re Release : గత ఏడాదిగా నేరుగా రిలీజ్ అయిన సినిమాల కంటే రీ-రిలీజ్‌ అయిన సినిమాల సంఖ్యే ఎక్కువ. ఇంతకుముందు బాక్సాపీస్ దగ్గర సెన్సెషనల్ హిట్టు సాధించిన ‘గబ్బర్‌సింగ్’, ‘ఖుషీ’, ‘సింహాద్రి’, ‘ఠాకూర్’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘ఇంద్ర’ వంటి సినిమాలతో పాటు అప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిన ‘ఆంధ్రావాలా’, ‘గుడుంబా శంకర్’ వంటి సినిమాలు కూడా థియేటర్లలోకి మళ్లీ వచ్చాయి.

తాజాగా ఈ లిస్టులోకి ప్రభాస్ ‘చక్రం’ సినిమా కూడా చేరనుంది. జూన్ 8న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు. ‘వర్షం’ మూవీతో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్, ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో ‘అడవి రాముడు’ మూవీ చేశాడు. ఈ మూవీ తర్వాత వచ్చిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చక్రం’ మూవీ చేశాడు. ప్రభాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Akshay Kumar : కన్నప్ప మూవీలో 4 రోజుల కాల్షీట్ కోసం అన్నీ కోట్లా..!?

ఎమోషనల్ సీన్స్, జనాలకు పిండేశాయి. ‘జగమంత కుటుంబం నాది’ పాట ఇప్పటికే చాలామంది రిపీటెడ్‌గా వింటూనే ఉంటారు. అయితే హీరో క్లైమాక్స్‌లో చనిపోవడంతో ‘చక్రం’ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఓ underrated క్లాసిక్ కావచ్చు, కానీ ఫ్యాన్స్‌ని మళ్లీ థియేటర్‌కి తెప్పించగలదా? ‘యోగి’ మూవీ రి-రిలీజ్ చేస్తే జనాలు పట్టించుకోలేదు. ‘చక్రం’ లాంటి ఎమోషనల్ మూవీని ఫ్యాన్స్ పట్టించుకుంటారా?

కనీసం ‘చక్రం’ తర్వాత వచ్చిన ‘ఛత్రపతి’ రీ-రిలీజ్ చేస్తే అయినా జనాలు థియేటర్లకు రావచ్చు. స్టార్ హీరోలు అందరూ రెండు మూడేళ్లకో సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా క్రేజ్ కోసం కష్టపడుతున్నారు. దీంతో థియేటర్లలోకి వచ్చే చిన్న, మధ్య తరహా సినిమాలను జనాలు పట్టించుకోవచ్చు. ఏం చేయాలో తెలియక ఇలా రీ-రిలీజ్‌ల బాట పడ్డారు. జూన్‌లో ప్రభాస్ ‘కల్కి’ రాబోతోంది. ఈ గ్యాప్‌లో ‘చక్రం’ రీ-రిలీజ్ అవసరమా అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post