Cadbury Chocolate : ఆకలిస్తే అన్నం పెట్టుకుని తినేవాళ్ల కంటే, ఫ్రిడ్జ్‌లో ఛాక్లెట్స్ తీసుకుని తినేవాళ్లే ఎక్కువ. 5 స్టార్, మంచ్, కిట్ క్యాట్, డైరీ మిల్క్, సిల్క్… ఇలా పేర్లు ఏవైనా వాటిని తయారుచేసే కంపెనీ ఒక్కటే.. Cadbury కంపెనీ నుంచి వచ్చే చాకెట్లకు ఇండియాలో బీభత్సమైన మార్కెట్ ఉంది. ‘ఏం చేయకుండానే చూద్దాం’, ‘చాక్లెట్ తిని మంచి కార్యం మొదలెడదాం’ ఇలా ప్రమోషన్‌తో మరింత మార్కెట్ పెంచుకుంటూనే ఉంది క్యాడ్‌బరీ..
Apple Coconut Halwa : న్యూట్రీషియన్ స్వీట్ రిసిపీ..
కొన్ని రోజుల కిందట డీమార్ట్‌లో కొన్న క్యాడ్‌బెరీ సిల్క్ చాక్లెట్‌లో పురుగు వచ్చిందని ఓ వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఓ వ్యక్తి, క్యాడ్‌బెరీ చాక్లెట్లు తినడం ఎంతవరకూ శ్రేయస్కరం అని విచారణ చేయగా, క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ, తన రిపోర్టులో నిర్దారించింది..
Cadbury నుంచి వచ్చే 5 Star, Gems, dairy milk, Orio, Perk, Eclairs వంటి ఛాక్లెట్లలో అధిక మోతాదులో చక్కర, ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలను వాడుతున్నట్టుగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ నివేదికల పేర్కొంది. చాక్లెట్లలో తేమ ఉండకుండా ఎండబెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ చాక్లెట్లలో 4.86 శాతం తేమ ఉంది. దీని వల్ల ప్యాక్ చేసిన చాక్లెట్లలో పురుగులు పెరిగే ప్రమాదం ఉందని, ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్స్‌కి అనుగుణంగా వీటిని తయారుచేయడం లేదని పేర్కొంది.
Hyderabadi Dum Biryani : వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ ధమ్ బిర్యానీ..