Bramayugam Review : మలయాళ మెగాస్టార్ మమ్మూట్టీ, నటుడిగా తనకు తాను పరీక్ష పెట్టుకుంటూనే ఉంటాడు. సవాల్ విసిరే పాత్రలు ఎంచుకుంటూ, అభిమానులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఓ సినిమాకి మరో సినిమాకి సంబంధం లేకుండా ప్లాన్స్ చేసుకున్న మమ్మూట్టీ, తాజాగా ‘భ్రమయుగం’ అనే హర్రర్ థ్రిల్లర్ మూవీ చేశాడు..
Masthu Shades Unnai Ra Review : కామెడీతో కనెక్ట్ చేసి, హిట్టు కొట్టేశాడుగా..
పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో తెరకెక్కిన ఈ సినిమా, రెండు వారాల ముందే మలయాళంలో విడుదలై అక్కడ సంచలన విజయం సాధించింది. ఫిబ్రవరి 23న తెలుగు డబ్బింగ్ వర్షన్ థియేటర్లలోకి వచ్చింది.
17వ శతాబ్దంలో జైలు నుంచి తప్పించుకుని, అడవిలోకి పారిపోయిన ఓ ఖైదీ, అక్కడ ఓ పాడుబడిన బంగ్లాలోకి చేరుకుంటాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఖైదీని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేస్తారు. అయితే అక్కడి నుంచి బయటపడాలని ఆ ఖైదీ ఎంత ప్రయత్నించినా వీలు కాదు. అసలు ఆ ఇంట్లో ఏమైంది? ఎందుకని అతను బయటపడలేకపోయాడు? ఇదే ‘భ్రమయుగం’ స్టోరీ..
Sundaram Master Review : జస్ట్ పాస్ మార్కులతో పాసైన ఇంగ్లీష్ మాస్టర్..
ఇలాంటి సినిమాల్లో కథ పెద్దగా ఉండేది. ఉండేదంతా సింపుల్ డ్రామానే! దాన్ని మమ్మూట్టీ, సిద్ధార్థ్ భరతన్, అర్జున్ అశోకన్ తమ నటనతో మరో స్థాయికి తీసుకెళ్లారు. హర్రర్ అంటే దెయ్యాలు రావడం, కామెడీ లేదా భయపెట్టడం మాత్రమే కాదు. అంతకుమించి చాలా చేయొచ్చు. అలాంటి ప్రయోగమే ఈ ‘భ్రమయుగం’. విభిన్నమైన సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్ఛితంగా నచ్చుతుంది. అయితే ఓ ఆరు పాటలు, మూడు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్లు, రొమాన్స్, హీరోయిన్, ఐటెం సాంగ్స్ ఇలా మాస్ మసాలా కోరుకునేవారికి ఈ ‘భ్రమయుగం’ మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు..