BootCut Balaraju Review : బిగ్ బాస్ టీవీ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న సయ్యద్ సోహైల్, హీరోగా సక్సెస్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే విభిన్నమైన కథాంశంతో సినిమా తీసిన సోహైల్, తాజాగా ‘బూట్ కట్ బాలరాజు’ మూవీతో థియేటర్లలోకి వచ్చాడు..
Srimanthudu Controversy : మహేష్ ని కేసు నుంచి తప్పించిన నమ్రత..
మేఘ లేఖ హీరోయిన్‌గా నటించిన ‘బూట్ కట్ బాలరాజు’ మూవీలో సిరి హనుమంతు, ఇంద్రజ, అవినాష్ వంటి బిగ్ బాస్ నటీనటులు నటించారు. ఓ గ్రామంలో అల్లరి చిల్లరగా తిరిగే హీరో, తన ఊరి వాళ్లందరి నుంచి చివాట్లు తింటూ ఉంటాడు. అయితే అవేమీ పట్టించుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటి హీరో జీవితంలోకి హీరోయిన్ రాకతో స్టోరీ మారిపోతుంది. ఆ ఊరి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని ఛాలెంజ్ చేసిన హీరో, తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? ఇదే ఈ ‘బూట్ కట్ బాల రాజు’ కథ…
ఇలాంటి కథలతో ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి. జగపతి బాబు ‘పందెం’ మూవీ కూడా ఈ కోవలోకి వచ్చేదే. శ్రీ కొనేటి తాను రాసుకున్న కథను, తెరపైకి అనుకున్నట్టుగా చేర్చడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ ట్రైలర్‌లో చూపించినట్టుగా కామెడీ బాగానే వర్కవుట్ అయ్యింది. బీమ్స్ మ్యూజిక్ సినిమాకి అదనపు బలం. సాంగ్స్ కూడా బాగున్నాయి.
Kismat Review : కిస్మత్ ఏం మారలే..
అయితే ఫస్టాఫ్ సాగినట్టుగా, సెకండాఫ్ సాగదు. కొన్ని సీన్స్ బాగా సాగతీసినట్టు అనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కామెడీ సీన్స్ వర్కవుట్ అయినా ఇంతకుముందే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి ‘బూట్ కట్ బాలరాజు’ మూవీలో కామెడీ వర్కవుట్ అయినట్టే కానీ సెంటిమెంట్, ఎమోషన్స్ రొటీన్‌గా అనిపిస్తాయి..
Ambajipeta Marriage Band Review : బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సుహాస్..