Bollywood Powerhouse RGV :బాలీవుడ్‌ని ఏలింది ఓ తెలుగోడు! ఆర్జీవీ వల్లే ఈ పొజిషన్‌లో ఉన్నాం..

Bollywood: రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న నటుల్లో మనోజ్‌ బాజ్‌పాయ్ ఒకడు. ఆర్జీవీ దర్శకత్వంలో ‘దౌడ్’, ‘సత్య’, ‘ప్రేమకథ’ (సుమంత్ తొలి సినిమా), కౌన్, షూల్, రోడ్ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన మనోజ్ బాజ్‌పాయ్, ఈ మధ్యకాలంలో తెలుగులో ‘పులి’, ‘వేదం’ వంటి సినిమాల్లో నటించాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న మనోజ్ బాజ్‌పాయ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉన్న నటుల్లో ఒకరు..

‘బాలీవుడ్ ఇండస్ట్రీని ఏ నార్త్ ఇండియనో లేక ముంబై ఇండస్ట్రీకి చెందినవాళ్లో మార్చలేకపోయారు. హైదరాబాద్‌కి చెందిన ఓ తెలుగువాడు, బాలీవుడ్‌ని మార్చాడు. రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్‌కి సినిమాలు ఎలా తీయాలో నేర్పించాడు. అతనికి ఎలాంటి భయం ఉండదు. ఎవ్వరికి భయపడడు. ఇప్పటికీ అంతే.. అతని ధైర్యసాహసాల వల్లే ముంబై ఇండస్ట్రీకి ఓ నిర్దిష్టమైన రూపు రేఖలు వచ్చాయి.. లేకపోతే బాలీవుడ్ గతి ఇంకోలా ఉండేది..’ అంటూ కామెంట్ చేశాడు మనోజ్ బాజ్‌పాయ్..

‘శివ’ టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్ చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తే ‘శివకి ముందు -శివ తర్వాత’ అని చెప్పాల్సి ఉంటుంది. తెలుగులో కొన్ని వరుస సినిమాలు చేసిన తర్వత ముంబైకి మకాం మార్చాడు రామ్ గోపాల్ వర్మ. అక్కడ 2 దశాబ్దాల పాటు సినిమాలు తీసి, మళ్లీ టాలీవుడ్‌కి తిరిగి వచ్చాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు తీసిన ఆర్జీవీ, ప్రస్తుతం ‘శారీ’ అనే సినిమా చేస్తున్నాడు..

Bollywood : బాలీవుడ్‌ పనైపోయిందా..!?

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post