బిగ్‌బాస్‌కి నాగ్ గుడ్‌బై! నెక్ట్స్ సీజన్ హోస్ట్ ఆ హీరోనట..

Bigg Boss Telugu 8 Host : బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. గత సీజన్‌తో పోలిస్తే, ఈ సీజన్‌కి మంచి టీఆర్పీ దక్కింది. అయితే గత ఐదు సీజన్లుగా బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున, వచ్చే సీజన్ నుంచి ఈ షో చేయనని చెప్పేశాడట..

బిగ్ బాస్ విన్నర్ అతనే, కానీ ఎక్కువ తీసుకుంది మాత్రం శివాజీయే.. ఎలాగంటే..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 పూర్తిగా ఓటీటీ వెర్షన్‌లో జరిగింది. వచ్చే సీజన్‌ కూడా ఓటీటీలో నిర్వహించాలని స్టార్ మా భావిస్తోందట. ఈ సీజన్‌లో సెలబ్రిటీల కంటే పల్లవి ప్రశాంత్, యావర్ వంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు.

దీంతో బిగ్ బాస్ సీజన్ 8లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, జబర్దస్త్ సెలబ్రిటీలతో నింపేయాలని ఫిక్స్ అయ్యారట. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్‌గా శ్రీకాంత్ వ్యవహరించబోతున్నట్టు సమాచారం..

‘బిగ్‌బాస్’ నిజంగా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందా..!?

ఫ్యామిలీ సినిమాలతో మహిళల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న శ్రీకాంత్, సోలో హీరోగా హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది. వరుస ఫ్లాపులతో సోలోగా సినిమాలు చేయడమే మానేశాడు. ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ చేసినా పెద్దగా లాభాలు రాలేదు. అదీకాకుండా శ్రీకాంత్ చాలా సున్నిత మనస్కుడని కూడా అంటారు. అలాంటి శ్రీకాంత్, బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ని ఎలా మ్యానేజ్ చేస్తాడు? తెలియాలంటే వచ్చే సీజన్ మొదలయ్యేదాకా ఆగాల్సిందే.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post