Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయ్యింది. 15 వారాల పాటు సాగిన బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫైనల్ ముగిసిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు, మిగిలిన కంటెస్టెంట్స్ కార్లపై దాడులు చేశారు. అమర్దీప్, అశ్విని, బిగ్ బాస్ బజ్ గీతూ రాయల్ కార్లపై దాడులు చేసి, అద్దాలు పగలకొట్టారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్… అటుగా వచ్చిన 10H కొండాపూర్ బస్సుపై కూడా దాడులు చేశారు పల్లవి ప్రశాంత్ వెర్రి ఫ్యాన్స్..
ఎకరాకి రూ.15 వేలు అన్నారు! ఒక్క రూపాయి వేశారు… రైతు బంధు ఇక ‘బంద్’యేనా..
ఈ ప్రోగ్రామ్ని బ్యాన్ చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేస్తూనే వస్తున్నాడు. తాజాగా బిగ్ బాస్ ప్రోగ్రామ్ని బ్యాన్ చేయాలని హైకోర్టు అడ్వకేట్ అరుణ్ పిటిషన్ దాఖలు చేశాడు. బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ పేరుతో పార్టిసిపెంట్లను బలవంతంగా 100 రోజుల పాటు ఓ హౌస్‌లో నిర్భధించడం చట్ట వ్యతిరేకం. బిగ్ బాస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న అక్కినేని నాగార్జునను అరెస్ట్ చేయాలి.
అలాగే బిగ్ బాస్‌లో పాల్గొంటున్న వారిపై కూడా విచారణ జరపాలి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే అధికారం, హక్కు ఎవ్వరికీ లేదు. దీని వెనక ఏదో కుట్ర జరిగింది. దాన్ని బయటికి తీయాల్సిన బాధ్యత పోలీసులదేనంటూ తన పిటిషన్లో పేర్కొన్నాడు అడ్వకేట్ అరుణ్..
కొత్త కుర్రాళ్లు, సూపర్ హిట్లు కొట్టారు.. 2023 ఏడాది వాళ్లకి బాగా కలిసి వచ్చిందిగా..
ఈ దాడుల తర్వాత జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కంటెస్టెంట్ అమర్‌దీప్‌ని గాయపర్చిన కేసులో పల్లవి ప్రశాంత్‌ని ఏ1 ముద్దాయిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అయితే ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్టు సమాచారం..