గొర్రెతనం పోలేదహే! అమర్‌దీప్, అశ్విని కార్లతో పాటు ఆర్టీసీ బస్సుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి..

Bigg Boss Prashanth Fans Attacked the  Amardeep and Ashwini’s Cars : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కనీసం 50 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ కూడా 70 శాతానికి అటు ఇటుగా ఉంది. భవిష్యత్తుని డిసైడ్ చేసే ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. ఎవడు గెలిస్తే ఏంటి? నాకైం సంబంధం అన్నట్టుగా సైలెంట్‌గా ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నారు చాలా మంది..

‘బిగ్‌బాస్’ నిజంగా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందా..!?

సరిగ్గా రెండు వారాలకు అందరిలోనూ ఒక్కసారిగా ఆవేశం మేల్కొంది. రైతు బిడ్డకు అన్యాయం జరుగుతోందంటూ అందరూ బయటికి వచ్చారు. పూజలు, ప్రార్థనలు, ర్యాలీలు చేశారు. వాయమ్మో… రైతులకు ఏదో అన్యాయం జరుగుతోందని జనాలు తెగ ఫీలైపోతున్నారని అనుకుంటే పొరపాటే! బిగ్ బాస్ ఫ్యాన్స్ వెర్రితనం ఇది..

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా ఓ సామాన్యుడు పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, బిగ్ బాస్ హౌస్ బయట కాపు కాచి… మిగిలిన పార్టిసిపెంట్ల కార్లపైన దాడులు చేశారు. రన్నరప్ అమర్‌దీప్‌తో పాటు అశ్విని, బిగ్ బాస్ బజ్ హోస్ట్ రీతూ రోయల్ కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగలకొట్టారు..

బిగ్‌బాస్‌కి నాగ్ గుడ్‌బై! నెక్ట్స్ సీజన్ హోస్ట్ ఆ హీరోనట..

21వ శతాబ్దంలో, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలిచిన భారత్‌లో ఓ టీవీ ప్రోగ్రామ్ కోసం ఇలా గొర్రెల్లా కొట్లాడే వాళ్లే మన భవిష్యత్ తరం. ఇంతకుముందు బిగ్ బాస్ 2 సీజన్‌లో కౌశల్ ఆర్మీ అంటూ చాలా మంది గొర్రెలు అయ్యారు. అక్కడి నుంచి ప్రతీ సీజన్‌లో ఇలా గొర్రెల్లా ఓ టీవీ ప్రోగ్రామ్ కోసం కొట్టుకునే కోడి మెదడు జనాల సంఖ్య పెరుగుతూనే పోతోంది..

https://twitter.com/Rebel_Kartheek/status/1736462103584936022

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post