Bhoothaddam Bhaskar Narayana Review : పాత సబ్జెక్ట్‌తో సరికొత్త డీలింగ్..

Bhoothaddam Bhaskar Narayana Review : టీజర్‌తో అంచనాలు పెంచిన మూవీ ‘భూతద్దం భాస్కర నారాయణ’. కొత్త దర్శకుడు పురుషోత్తం రాజ్, తాను సరికొత్త సబ్జెట్‌తో థ్రిల్లర్ చూపించబోతున్నట్టుగా ట్రైలర్‌లోనే చెప్పేశాడు. మార్చి 1న విడుదలైన ఈ సినిమాకి ఒక్క రోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడిపోయాయి. మరి ‘భూతద్దం భాస్కర నారాయణ’ సక్సెస్ అయ్యాడా? లేదా..

Operation Valentine : ఆపరేషన్ సక్సెస్ కానీ, ఎమోషన్స్ మాటేంటి..

అమ్మాయిలను దారుణంగా చంపేసి, వారి తలను తీసుకెళ్లి పోతూ ఉంటాడు ఓ సీరియల్ కిల్లర్. మహిళల తల స్థానంలో దిష్టి బొమ్మ తల పెడుతూ ఉంటాయి. ఇలా ఏకంగా 17 హత్యలు జరుగుతాయి. వీరిని ఎవరు ఇలా చంపుతున్నారు? అనేది తెలుసుకోవడానికి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ వస్తాడు. ఆ హత్యల మిస్టరీని భూతద్దం భాస్కర నారాయణ ఎలా ఛేదించాడు? అనేదే ఈ సినిమా..

డిటెక్టివ్ సినిమాలకు ప్రధాన బలం మొదటి సీన్‌లో మొదలైన సస్పెన్స్‌ని, చివరి వరకూ కొనసాగించడమే… ఈ విషయంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ కాస్త సాగినా సెకండాఫ్‌లో ట్విస్టులు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వేరే లెవెల్‌గా అనిపిస్తాయి.

ఇంతకుముందు ‘చూసి చూడగానే’, ‘గమనం’, ‘మనుచరిత్ర’ వంటి సినిమాల్లో నటించిన శివ కందుకూరి, ఈ సినిమాలో తన నటనతో మెప్పించాడు. హీరోయిన్ రాశి సింగ్, షపీ తదితరులు చక్కగా నటించారు. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానినన్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమా సక్సెస్‌లో ఎక్కువ భాగం వీరికే దక్కుతుంది.. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ కచ్ఛితంగా నచ్చుతుంది.

Chaari 111 Review : వెన్నెల కిషోర్ సేమ్ సీన్ రిపీట్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post