Bhogi Festival 2024 : భోగి మంటలెందుకు వేస్తారు.. భోగి పళ్ళ విశిష్టత..

Bhogi Festival 2024
Bhogi Festival 2024

Bhogi Festival 2024 : సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది ‘భోగి’ పండుగ. భోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగిరోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దరిద్ర్య దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే.. తెల్లవారు ఝామున భోగిమంటలు వేయటం సాయంత్రం భోగిపండ్లు పోయించుకోవడంతో పిల్లలు హుషారుగా ఉంటారు. ‘భగ’ అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని చెబుతారు. ‘భగ’ అంటే ‘మంటలు’ లేదా ‘వేడి’ని పుట్టించడం అని అర్ధం.

Modi Photo shoot in Lakshadweep : లక్ష్యదీప్‌లో మోదీ ఫోటోషూట్! మాల్దీవులకు ఎన్ని వేల కోట్ల నష్టం తెచ్చిందంటే..

భోగి సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినిగా భావిస్తారు. రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు. భోగిపళ్ళలో చేమంతి బంతి పూరేకలు అక్షింతలు చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం పూర్వం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగిపండగ ఆచరణలోకి వచ్చిందని పురాణ గాధ.

అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు.

అవి కాలడానికి ఆవు నెయ్యని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

అమెరికాలోని హిందూ దేవాలయంపై ఖలిస్థానీ నినాదాలు..

ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు మనలోని పనికి రాని అలవాట్లు చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది. ఈభోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు నువ్వుల లడ్డు జంతికలు చక్కలతో పాటు రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాల్లోని తెలుగు వారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభం అవుతుంది.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post