Bhimaa Review : పదేళ్ల కిందట వచ్చిన ‘లౌక్యం’ తర్వాత గోపిచంద్‌కి సరైన కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. ‘గౌతమ్ నంద’ వంటి సినిమాలకి మంచి రేటింగ్స్ దక్కినా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. ‘రామబాణం’ వంటి డిజాస్టర్ తర్వాత గోపిచంద్ చేసిన సినిమా ‘భీమా’… ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన ‘భీమా’, ఆ అంచనాలను అందుకోగలిగిందా…
Gaami Review : టాలీవుడ్‌లో మరో ప్రయోగం..
బెంగళూరు, బాదామి ఏరియాల మధ్య నట్టడవిలో ఉండే పరుశురామ క్షేత్రంలో కొన్ని దారుణాలు జరుగుతుంటాయి. దీంతో ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ భీమా అక్కడికి వస్తాడు. అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? వాటిని భీమా ఎలా ఛేదించాడు. ఇదే ‘భీమా’ కథ..
కొన్నాళ్లుగా రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన గోపిచంద్, ఈసారి సోషల్ ఫాంటసీ మిళితం చేసిన సినిమాని ఎంచుకున్నాడు. కన్నడ దర్శకుడు హర్ష, ఇంతకుముందు సాండల్‌వుడ్‌లో చాలా సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. తెలుగులో అతనికి ఇదే మొదటి సినిమా..
ఫస్టాఫ్‌లో కామెడీని నింపి, ఇంటర్వెల్ సమయానికి కథను ఓ కొలిక్కి తీసుకొచ్చాడు హర్ష. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్‌తో సినిమా ఓ హై మూమెంట్‌ని అందుకుంటుంది. ట్విస్టులతో సెకండాఫ్ ఓ థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ వేరే రేంజ్‌లోకి వెళ్తుంది. రవి బస్రూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాకి హైలైట్…
Premalu Review : క్యూట్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ..
శివుడి ఎపిసోడ్స్, వీఎఫ్‌ఎక్స్, ఎద్దుపై ఎంట్రీ ఇచ్చే సీన్స్, ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఓ రకంగా గోపిచంద్ కోరుకుంటున్న కమ్‌బ్యాక్ దక్కినట్టే.. బీ, సీ సెంటర్లలో జనాలకు ‘భీమా’ బాగా కనెక్ట్ అవుతుంది. ఏ సెంటర్లలో జనాలకు ఈ మూవీ కనెక్ట్ అవ్వడం అనుమానమే..