Bharateeyu 2 Collections : సాధారణ కాస్త మిక్స్డ్ టాక్ వస్తేనే ఆ సినిమాని తీసి పక్కనబెట్టేస్తారు తెలుగువాళ్లు. అందులోనూ డబ్బింగ్ సినిమాలకు టాక్ బాగోలేకుంటే అస్సలు చూడరు. అలాంటిది ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చిన ‘భారతీయుడు 2’ మూవీ అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంది.
ఈ సినిమాకి తెలంగాణలో భారీ హైక్ దొరికింది. ఆంధ్రాలో మాత్రం హైక్ ఇవ్వలేదు. సాధారణ టికెట్ ధరలకే సినిమా రిలీజ్ చేశారు. తొలిరోజు నైజాంలో రూ.2.90 కోట్లు వసూలు చేసిన ‘భారతీయుడు 2’ తెలుగు వర్షన్, సీడెడ్ ఏరియాలో రూ.92 లక్షలు రాబట్టింది. ఆంధ్రాలో రూ.3 కోట్ల వరకూ వసూలు చేసింది. ఓవరాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.10.8 కోట్ల గ్రాస్, రూ.6.75 కోట్ల షేర్ వసూలు చేసింది ‘భారతీయుడు 2’ మూవీ..
Bharateeyudu 2 Movie Review : నో ఎమోషన్స్, ఓన్లీ కరెప్షన్..
ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రూ.24 కోట్లకు విక్రయించారు. అందులో దాదాపు పావు వంతు తొలిరోజే వచ్చేసింది. ఇదే సినిమాకి తమిళనాడులో కేవలం రూ.13.4 కోట్ల గ్రాస్ మాత్రమే రావడం విశేషం. తమిళనాడులో శంకర్ సినిమాకి ఇంత తక్కువ రెస్పాన్స్ రావడం అభిమానులను షాక్‌కి గురి చేసింది. కర్ణాటక, కేరళ, ఓవర్సీస్లో మాత్రం ‘భారతీయుడు 2’ సినిమాకి తొలిరోజు మంచి వసూళ్లు వచ్చాయి. రెండో రోజు కూడా ‘భారతీయుడు 2’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ బాగున్నాయి. తమిళనాడులో మాత్రం సినిమా డిజాస్టర్ రిజల్ట్ తెచ్చేసుకున్నట్టే..