Bengaluru Water Crisis : బెంగళూరులో నీటికి కటకట… తాగడానికే నీళ్లు లేవంటే..

Bengaluru Water Crisis : బెంగళూరు నగరంలో నీటి కొరతతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఆఫీసుల్లో నీటి వాడకాన్ని తగ్గించేందుకు చాలా ఐటీ కంపెనీలు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఇంట్లో స్నానానికి నీళ్లు లేకపోవడంతో చాలామంది మల్టీప్లెక్సుల్లోని వాష్‌రూమ్స్‌లో స్నానం చేస్తున్నారు. నీటి ఎద్దడిని తట్టుకోలేక చాలా హాస్టళ్లకు, హోటళ్లకు తాళాలు పడ్డాయి. అయితే ఇలాంటి విపర్కత కరువు పరిస్థితుల్లోనూ కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో విలాసాల కోసం స్విమ్మింగ్ ఫూల్స్‌లో మంచి నీటిని వాడుతున్నారట…

Drinking Water : నీళ్లు తాగడం ఒక ఆర్ట్..

నిజానికి స్విమ్మింగ్ ఫూల్స్‌లో క్లోరిన్ అధికంగా ఉండే నీటిని వాడతారు. అయితే దీని వల్ల కొన్ని ఆరోగ్య ఇబ్బందులు వస్తున్నాయని, మంచి నీటితో స్విమ్మింగ్ ఫూల్స్‌ని నింపేసి, ఎండ వేడి నుంచి సేదతీరుస్తున్నారు మిలియనీర్ విల్లా ఓనర్లు, వారి పిల్లలు.. దీంతో ఇలా స్విమ్మింగ్ ఫూల్స్‌లో మంచి నీటిని వాడడాన్ని పూర్తిగి నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది బెంగళూరు వాటర్ సప్లై బోర్డు. ఎవరైనా ఇలా మంచి నీటితో స్విమ్మింగ్ ఫూల్‌ని నింపితే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింద. మళ్లీ అదే రిపీట్ చేస్తే మరో రూ.500 అదనంగా జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలపింది..

అయితే గంటకు వేలకు వేలు ఖర్చు చేస్తూ విలాసంగా బతికే బెంగళూరు బడా బాబులు, ఈ 5 వేల రూపాయల ఫైన్‌కి భయపడి, మంచి నీటి స్విమ్మింగ్ ఫూల్స్‌లో సేద తీరడం మానేస్తారంటారా? వాళ్లు మానేయరని ఆ బోర్డుకి కూడా తెలుసు. అలాగని డబ్బులు వసూలు చేసేందుకు నామమాత్రంగా చేసిన వార్నింగ్ అని సాధారణ జనాలకు కూడా అర్థమైపోయింది..

మీ భాషాభిమానం తగలెయ్యా! బెంగళూరులో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సీన్స్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post