Bandla Ganesh : టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌కి చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన బండ్ల గణేశ్, కోళ్ల పరిశ్రమ, రియల్ ఎస్టేక్ వ్యాపారాలతో బాగా సంపాదించాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో బ్యానర్ స్థాపించి, రవితేజతో ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారాడు. ఇప్పటిదాకా ఈ బ్యానర్ నుంచి ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’, ‘బాద్షా’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘టెంపర్’ వంటి సినిమాలు వచ్చాయి..
Prabhas Kalki 2898AD : కల్కి నిండా స్టార్లే! నాగ్ అశ్విన్ పెద్ద రిస్కే చేస్తున్నాడా..
‘టెంపర్’ తర్వాత ఇప్పటిదాకా మరో సినిమాని విడుదల చేయని బండ్ల గణేశ్, రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని ఛాలెంజ్ చేసిన బండ్ల గణేశ్ మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. తాజాగా బండ్ల గణేశ్‌కి చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. 2019లో జానకి రామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తం తిరిగి చెల్లించడానికి చెక్ ఇచ్చాడు…
అయితే అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో అది కాస్తా బౌన్స్ అయ్యింది. దీంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించగా తాజాగా ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షలు తిరిగి చెల్లించడంతో కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. ఇంతకుముందు 2017లో టెంపర్ కథ రచయిత వక్కంతం వంశీకి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయ్యింది. అప్పుడు కూడా బండ్ల గణేశ్‌కి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడింది.