Balayya – Radhika Apte : తమిళ ‘బిగ్‌బాస్’ కార్యక్రమంలో సీనియర్ నటి విచిత్ర కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలపై కోలీవుడ్‌లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ‘2001లో ఓ మూవీ షూటింగ్‌లో హీరో వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా’ అంటూ వ్యాఖ్యానించిన విచిత్ర, ఆ అనుభవంతోనే సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొంది. సినిమా పేరు, హీరో పేరు ప్రస్తావించకపోయినా తమిళ సినిమాలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పడంతో తెలుగు సినిమా ‘భలే వాడిని బాసు’ గురించే విచిత్ర ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుందని అంటున్నారు కోలీవుడ్ ఫ్యాన్స్..
బాలకృష్ణ మూవీ షూటింగ్‌లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..
తాజాగా రాధికా ఆప్టే చేసిన పాత వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కోలీవుడ్ ఫ్యాన్స్. ఓ ఇంటర్వ్యూలో ‘నేను తెలుగులో ఓ పెద్ద హీరోతో కలిసి నటించాను. ఆ హీరోని కలిసిన మొదటి రోజే నాకు చేదు అనుభవం ఎదురైంది. నీ బ్యాక్‌కి దురద అనిపిస్తే, నేనొచ్చి రుద్దుతా.. అని ఆ హీరో నాతో అసభ్యంగా మాట్లాడాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయా..
ఆ తర్వాత ఓ సారి వచ్చి, నా పక్కన కూర్చొని తొడలపై చేయి వేశాడు. అంతే అందరి ముందు చెంప చెల్లుమనిపించా.. అయితే డబ్బుల కోసం అతనితో మళ్లీ కలిసి నటించాల్సి వచ్చింది…’ అంటూ వ్యాఖ్యానించింది రాధికా ఆప్టే. బాలకృష్ణతో ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన రాధికా ఆప్టే, ఆ తర్వాత ‘లయన్’ మూవీలోనూ కలిసి చేసింది.
మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన మాధవీలత… ఆ వ్యాఖ్యలు బాలయ్యను ఉద్దేశించేనా..
అప్పుడు రాధికా ఆప్టే, ఇప్పుడు విచిత్ర ఇద్దరూ కూడా నందమూరి బాలకృష్ణ గురించే లైంగిక వేధింపుల వ్యాఖ్యలు చేశారని, ఇప్పటికైనా సినీ పరిశ్రమ స్పందించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు కోలీవుడ్ ఫ్యాన్స్. అయితే కోలీవుడ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చను తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు.