Balakrishna : నందమూరి బాలకృష్ణకి ఉండే కోపం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోపం వస్తే, అభిమాని అని కూడా చూడకుండా చెంప చెళ్లుమనిపిస్తాడు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రూలర్’ సినిమా టైమ్‌లో కూడా ఓ అసిస్టెంట్‌ని కొట్టాడు బాలయ్య. తాజా ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు దర్శకుడు కె.ఎస్. రవికుమార్..
బాలయ్యని టార్గెట్ చేస్తున్న కోలీవుడ్.. విచిత్ర కామెంట్స్ తర్వాత రాధికా ఆప్టే వ్యాఖ్యలు వైరల్..
‘బాలకృష్ణకి తనవైపు ఎవరైనా చూసి నవ్వితే, విపరీతమైన కోపం వస్తుంది. వెటకారంగా నవ్వుతున్నారనే అనుకుంటాడు. రూలర్ షూటింగ్ సమయంలో నా అసిస్టెంట్ డైరెక్టర్, చేతిలో ఫ్యాన్ పట్టుకుని బాలకృష్ణ విగ్ చూసి నవ్వాడు. మేం అనుకున్న గెటప్, సరిగ్గా కుదరలేదు. అయితే బాలయ్యకి విపరీతమైన కోపం వచ్చేసింది.
నా అసిస్టెంట్‌ని కొట్టేలోపు, నేను వాడు నా అసిస్టెంట్ అని చెప్పాను. బాలకృష్ణ నా వైపు, వాడికి ఫుల్లుగా జట్టు ఉంది. వాడు మన గ్యాంగ్ కాదు, మన విలన్ వాడు అన్నాడు.. ఆ మాటలతో నా అసిస్టెంట్ కూడా పగలబడి నవ్వాడు. ఆయనకి కోపం ఎక్కువే, కానీ దానికి పెద్ద కారణాలు ఉండవు.. ’ అంటూ కామెంట్ చేశాడు కె.ఎస్. రవికుమార్..
తమిళ్‌లో ‘ముత్తు’, ‘నరసింహా’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన కె.ఎస్. రవికుమార్, తెలుగులో ‘బావ నచ్చాడు’, ‘స్నేహం కోసం’, ‘జై సింహా’, ‘రూలర్’ సినిమాలు తీశాడు. ‘జై సింహా’ 100 రోజులు ఆడడంతో వీరి కాంబినేషన్‌లో వెంటనే వచ్చిన ‘రూలర్’ డిజాస్టర్‌గా నిలిచింది.
BootCut Balaraju Review : కామెడీ వర్కవుట్ అయ్యినట్టే కానీ..