Balakrishna : భువనేశ్వరికి ముద్దు పెట్టిన అన్న.. ‘యానిమల్’ మూవీతో పోలుస్తూ.. వైరల్ అవుతున్న వీడియో..

Balakrish kiss
Balakrish

Balakrishna : నందమూరి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదరణ, క్రేజ్ వేరే లెవెల్. అందులోనూ నందమూరి బాలకృష్ణ అంటే ఓ స్పెషల్ ఎమోషన్.. పార్టీ ఏదైనా, సందర్భం ఏదైనా జోష్ రావాలంటే ‘జై బాలయ్య’ అనాల్సిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, తన సోదరి నారా భువనేశ్వరికి ఆత్మీయంగా ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న సమయంలో నారా భువనేశ్వరి, ఒంటరిగా కూర్చున్న విషయాన్ని గమనించిన నందమూరి బాలకృష్ణ.. ఆమె దగ్గరికి వెళ్లి, భుజం తట్టి, ఆత్మీయంగా తలపైన ముద్దు పెట్టి.. అలా వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Narendra Modi : మూడోసారి మోడీకి పట్టాభిషేకం.. చంద్రబాబు డిమాండ్స్ ఏంటంటే..

బాలకృష్ణ ఏం చేసినా సోషల్ మీడియా షేక్ అవ్వడం గ్యారెంటీ. ఇందులో వింతేముంది. అయితే ఉన్న వీడియోని ఉన్నట్టుగా కాకుండా రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ మూవీలో హీరో, తన అక్కకు తల మీద ముద్దు పెట్టే సన్నివేశంతో బాలకృష్ణ ముద్దును పోల్చి చూస్తూ.. రీల్స్ చేస్తున్నారు నెటిజన్లు..

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ మూవీలో రణ్‌బీర్ కపూర్, అల్ఫా మేల్ రణ్‌విజయ్ సింగ్ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ఈ పాత్రను బాలయ్య చేసి ఉంటే, ఎలా ఉండేదో కూడా అప్పట్లో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post