Bahubali 3 : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ‘బాహుబలి’. ఫస్ట్ పార్ట్ ‘బాహుబలి ది బిగినింగ్’ మూవీ, ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేస్తే, ‘బాహుబలి ది కంక్లూజన్’ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టాప్‌లో నిలిచింది. ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ మూవీ కూడా ‘బాహుబలి 2’ కలెక్షన్లను అందుకోలేకపోయింది.
‘బాహుబలి’ ఫ్రాంఛైజీ నుంచి ‘ది రైజ్ ఆఫ్ శివగామి2 పేరుతో ఓ నవల వచ్చింది. అలాగే ‘బాహుబలి: ది లాస్ట్ లెజెండ్స్’ అనే యానిమినేడ్ సిరీస్ కూడా వచ్చింది. తాజాగా ‘బాహుబలి’ పార్ట్ 3గా ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్‌ని అనౌన్స్ చేశాడు ఎస్.ఎస్. రాజమౌళి. త్వరలో ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదల కాబోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు.
Rajamouli : ఆ ఇద్దరితో ప్రేమదేశం తీయాలనుకున్నాడట..
‘బాహుబలి 3’ ఉంటుందా? అంటే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నా, ప్రభాస్, రమ్యకృష్ణ, రానా డేట్స్ దొరకడం కష్టమని రాజమౌళి చెప్పుకొచ్చారు. అప్పుడెప్పుడో ‘బాహుబలి: బిఫోర్ ది బిగెనింగ్’ పేరుతో ఫస్ట్ పార్ట్‌కి ముందు ఏం జరిగిందో తెలియచేస్తూ నెట్‌ఫ్లిక్స్‌తో సిరీస్ చేయాలని అనుకున్నాడు రాజమౌళి. ఈ సిరీస్‌కి రాజమౌళి సహ నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రీ- ప్రొడక్షన్ పనుల తర్వాత ఈ సిరీస్ అర్ధాంతరంగా ఆగిపోయింది. రాజమౌళి, మహేష్‌తో సినిమా చేసేందుకు రెఢీ అవుతున్నాడు.. అందరూ మరిచిపోయిన సమయంలో మళ్లీ ‘బాహుబలి: Crown of Blood’ యానిమేటెడ్ సిరీస్‌ని అనౌన్స్ చేశాడు జక్కన్న.. ఈ యానిమేటెడ్ సిరీస్ కోసం కూడా భారీగా ఖర్చు చేసినట్టు సమాచారం.