Bad NewZ Movie Review : నాట్ బ్యాడ్ నాట్ గుడ్..

Bad NewZ Movie Review
Bad NewZ Movie Review

Bad NewZ Movie Review : ‘Animal’ మూవీ తర్వాత త్రుప్తి డిమ్రి నటించిన సినిమా ‘బ్యాడ్ న్యూస్’… విక్కీ కౌషల్, అమ్మీ విర్క్ హీరోలుగా నటించిన ‘బ్యాడ్ న్యూస్’ జూలై 19న విడుదలైంది. ఇప్పటికే విడుదలైన సాంగ్‌లో త్రుప్తి సూపర్ హాట్‌గా కనిపించడంతో అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ‘బ్యాడ్ న్యూస్’ అందుకోగలిగిందా?

చెఫ్‌గా పనిచేసే హీరోయిన్ సలోని, తన తల్లితో కలిసి ఓ పెళ్లికి వెళ్తుంది. అక్కడ విక్కీ కలుస్తాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వెంటనే పెళ్లి జరుగుతుంది. యూరప్‌లో హానీమూన్ చేసుకుంటాడు. ఆ వెంటనే చిన్న గొడవకే విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. ఈ గొడవలో ఉండగా తన బాస్‌ని చూసి మనసు పడుతుంది. ఈరాత్రి ఈ ముగ్గురూ కలిసి ఫుల్లుగా తాగి, సెక్స్‌లో పాల్గొంటారు. ఈ కారణంగా ఆమె గర్బం దాల్చుతుంది. తన కడుపులో తన భర్తతో పాటు బాస్ బిడ్డను కూడా మోస్తున్నట్టుగా తెలుసుకుంటుంది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని తెలుసుకుని, వారితో సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. ఇదే ‘బ్యాడ్ న్యూస్’ కథ…

Ram Charan Bollywood : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చెర్రీ..

ఈ సినిమా ఇంతకుముందు చూసిన చాలా సినిమాలను గుర్తుకు తెస్తుంది. కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయినా, పూర్తిగా ఎంటర్‌టైన్ చేయలేకపోయింది. సింగిల్ లైన్ పంచ్‌లు బాగానే పేలినా, స్క్రీన్ ప్లే సెట్ కాలేదు. క్లైమాక్స్ హడావుడిగా ముగించినట్టుగా అనిపిస్తుంది. అయితే రొమాన్స్ సీన్స్‌కి ఇచ్చిన ప్రాధాన్యం, శ్రద్ధ.. మిగిలిన సీన్లపై పెట్టలేకపోయాడు డైరెక్టర్. త్రుప్తి మంచి నటి, కానీ ఆమెను కేవలం హాట్ సీన్స్ కోసమే పెట్టుకున్నట్టుగా ఉంటుంది. విక్కీ కౌషల్ కామెడీ టైమింగ్ ఒక్కటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అడల్ట్ కామెడీ సినిమాలు ఇష్టపడేవారికి ‘బ్యాడ్ న్యూస్’ నచ్చొచ్చు. మిగిలినవారికి ఇది బిలో యావరేజ్ బొమ్మే..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post