Ayodhya Ram Mandir Leaking : బీజేపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రాజెక్ట్ అయోధ్య రామమందిరం. వంద కోట్ల హిందువుల కల అంటూ రామ జన్మభూమిగా చెప్పుకునే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించారు. అయితే ఎంతోమంది ఇంజనీర్లతో ప్లాన్ వేయించి, ఎంతో ఖర్చు చేసి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే ఇంత ఖర్చు చేసిన అయోధ్యలో మొదటి వర్షానికే పైకప్పు నుండి నీరు లీక్ అవుతోంది
శనివారం రాత్రి అయోధ్యలో కురిసిన భారీ వర్షం కారణంగా రామమందిర గర్భగుడి పైకప్పు నుండి నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు. శ్రీరాముడి ఎదుట పూజారి కూర్చునే చోట నీరు లీక్ అవ్వడం, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడంతో పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఆలయ నిర్మాణానికి ఎలా ప్లాన్ వేశారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది..
PM Modi – Ram Mandir : రామమందిరం కట్టిన చోటే, బీజేపీ ఎందుకు ఓడింది?
అంతేకాకుండా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులన్నీ జలదిగ్బంధంలో కూరుకుపోయి, అక్కడి ఇళ్లలోకి మురుగునీరు చేరింది. ఇంతకుముందు రామమందిరం నిర్మించక ముందు రహదారుల్లో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అయితే ఆలయం కోసం చాలా కాలనీలను ఖాళీ చేయించి, ఇళ్లు కూల్చివేయడంతో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. ఇది అక్కడ జనవ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. దీన్ని ప్రతిపక్షాలు రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి.
వేల కోట్లు పెట్టి ఆలయాన్ని నిర్మించినా దేవాలయ నిర్మాణ నాణ్యత, ప్రణాళికపై సందేహాలు కలిగిస్తోందని ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరిస్తారా? లేక అక్కడ అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకులదే బాధ్యత అని వదిలేస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది..