Awe Movie : హనుమాన్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ‘అ!’ చూశారా? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ బ్రిలియెన్స్..

Awe Movie
Awe Movie

Awe Movie : హనుమాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్‌లో ఫుల్లు ఫేమస్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మహేష్, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి, సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది ‘హనుమాన్’. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ, సినిమాటిక్ యూనివర్స్ పేరుతో 12 సినిమాలు చేస్తానని చెప్పాడు..

Hanuman Vs Guntur Kaaram : గుంటూర్ కారం మూవీకి షాక్ ఇచ్చిన హనుమంతుడు..

ప్రశాంత్ వర్మను టాలీవుడ్‌కి పరిచయం చేసింది నేచురల్ స్టార్ నాని. నాని నిర్మాతగా వచ్చిన ‘అ!’ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చాడు ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ చరిత్రలోనే, కాదు.. ఆ మాటకి వస్తే భారత చలన చిత్ర చరిత్రలో ‘అ!’ ఓ సంచలనం.. ఈ మూవీ కథ, కథనం అంతా ఈజీగా చాలా మందికి అర్థం కావు.

అసలు ‘అ!’ కథ ఏంటి? ‘అ!’ మూవీ టైటిల్స్ పడేటప్పుడు కాజల్ అగర్వాల్ ఓ రెస్టారెంట్‌కి వచ్చి, తన బుక్‌లో ఏవేవో గీస్తూ ఉంటుంది.. మొదట తను ప్రేమించిన వ్యక్తిని తల్లిదండ్రులకు పరిచయం చేసే పాత్రలో ఇషా రెబ్బా ఎంట్రీ ఇస్తుంది.

ఇషా రెబ్బా ఎవరిని ప్రేమిస్తుందా? అని ప్రేక్షకులతో మంచి క్యూరియాసిటీ ఏర్పడుతుంది. తీరా ఆమె ప్రేమించింది ఎవరినో కాదు… నిత్యామీనన్‌ని. అంతే ఇషా రెబ్బ ఓ లెస్బియన్… ఇక్కడే ఇషా రెబ్బ క్యారెక్టర్ తల్లి మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ‘అ!’ అని ఫీల్ అయిపోతారు… (డిఫరెంట్ లవ్ స్టోరీ)

Prashanth Varama : హనుమాన్ సక్సెస్ అయితే, అవతార్ రేంజ్‌లో మూవీ తీస్తా… ప్రశాంత్ వర్మ కామెంట్స్…

అదే రెస్టారెంట్‌లో వంటలు రాకున్నా చెఫ్‌ కావాలని కోరుకునే ప్రియదర్శి, అతనితో మాట్లాడే చేప (నాని వాయిస్ ఓవర్)… ఓ ఫిష్ ఆర్డర్ రావడంతో తనకు వంట చేయడానికి సాయం చేసిన చేపనే వండాల్సిన పరిస్థితి వస్తుంది! (కామెడీ)

అదే రెస్టారెంట్‌కి వాచ్‌మెన్‌గా పనిచేస్తూ, చిన్నప్పుడు తప్పిపోయిన తన అమ్మానాన్నలను కలవాలనుకునే సైంటిస్ట్ అవసరాల శ్రీనివాస్, టైమ్ మెషిన్ కనిపెట్టాలని తెగ కష్టపడుతూ ఉంటాడు. అతన్ని ఓ వీల్‌ఛైయిర్‌లో ఉన్న ఓ మహిళ (దేవదర్శిని) కలుస్తుంది.. ఆ మహిళ ఎవరో కాదు, అతనే!

తాను కనిపెట్టిన టైమ్ మెషిన్ ద్వారా ఫ్యూచర్ నుంచి టైమ్ ట్రావెల్ చేసి వెనక్కి వచ్చిన తానే అని తెలుసుకుంటాడు. లింగ మార్పిడి చేసుకుని, అమ్మాయిగా మారినట్టు చెప్పగానే ప్రేక్షకులు, మరోసారి ‘అ!’ అని నోరు తెరుస్తారు… (సస్పెన్స్)

వరల్డ్ గ్రేటెస్ట్ మేజిషియన్ అని ఫీలయ్యే మురళీ శర్మ, అతన్ని ఛాలెంజ్ చేసే ఓ చిన్న అమ్మాయి వల్ల కనిపించని మేజిషియన్ మ్యాజిక్‌లను ఫీల్ అవుతూ ఉంటాడు.. ఆ మేజిషియన్ ఎవరో కాదు కృష్ణుడినంటూ ఆ అమ్మాయి చెబుతుంది… (Devotional)

Sankranthi Movies 2024 : 3 రోజుల్లో హిట్టు కొట్టేసిన ‘హనుమాన్’.. ‘నా సామి రంగ’ కూడా సేఫే! ఆ రెండూ కష్టమే..

రెస్టారెంట్‌లో సర్వీస్ చేసే డ్రగ్ అడిక్ట్ రెజీనా కసాండ్రాకి ఓ లాకెట్ దొరుకుతుంది… ఆ లాకెట్ వేసుకున్న మహిళ దెయ్యంగా మారి, రెజీనాకి కనిపిస్తుంది… ఆ లాకెట్ కారణంగా రెజీనానే దెయ్యంగా మారిపోతుంది.. (హార్రర్)

క్లైమాక్స్‌లో అన్ని పాత్రలు, ఓ బొన్సాయ్ మొక్క కూడా మాట్లాడుతుంది. ప్రగతి రెస్టారెంట్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు తెచ్చిన డబ్బు కొట్టేయాలనుకునే రెజీనా బాయ్‌ఫ్రెండ్.. ఒకే సీన్‌లో అన్ని కథలు కలుస్తాయి.

అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. ఒక్క మూవీలో ఇన్ని రకాల జోనర్స్‌ని ఇరికించిన ప్రశాంత్ వర్మ, దానికి ఎలాంటి క్లైమాక్స్ ఇస్తాడా? అనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతుంది. అసలు ఈ అంతుచిక్కని పజిల్‌ని డైరెక్టర్ ఎలా పూరిస్తాడు?

అప్పుడే కాజల్ తానొక మాస్ మర్డర్ చేయబోతున్నానంటూ ట్విస్ట్ ఇస్తుంది.. ఏం చేస్తుంది? ఎవరిని చంపుతుంది? అని ఉత్కంఠ రేగుతుంది. ఇక్కడే ప్రశాంత్ తన బ్రిలియెన్స్ చూపించాడు.

8 ఏళ్ల వయసులో రేప్‌కి గురైన, తన జీవితంలో ఎన్నో దారుణ పరిస్థితులను ఫేస్ చేసిన కాజల్ అగర్వాల్.. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ వ్యాధికి గురవుతుంది. ఇప్పటిదాకా మనం చూసిన ప్రతీ క్యారెక్టర్ కూడా కాజల్ బుర్రలో ఆమె పాత్రలతో ఆమె చేసిన పోరాటమే. ఈ సినిమాలో కాజల్ చేసింది కీ రోల్ కాదు.. కాజలే అన్ని రోల్స్ చేసిందని తెలిసి… ‘మైండ్ బ్లాక్’ అవుతుంది.

90’s – A Middle Class Biopic : డైరెక్టర్‌గా తొక్కేసినా, నిర్మాతగా సూపర్ సక్సెస్..

ఓ కథను రాయడానికి ఒక్కో క్యారెక్టర్‌ని నిర్మించడానికి రైటర్, మానసికంగా ఎంతో మథనపడాల్సి ఉంటుంది. ఇక్కడ అదే మథనాన్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు. తన బుర్రలో పేరుకుపోయిన ఎమోషన్స్, ఒక్కో క్యారెక్టర్‌గా మారి.. తనకంటూ ఓ సొంత జీవితాన్ని ఏర్పరచుకుంటారు.

మహావిష్ణువు త్రేతా యుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా ఇలా దశావతరాలు ఎత్తాడు. ఒకేసారి పది అవతరాలు తారసపడితే… ఓ అవతారంతో మరో అవతారం తలబడితే… అదే ‘అ!’… అందుకే ఆ పాత్రల మధ్య అంతర్ యుద్ధాన్ని తట్టుకోలేక, చిట్టి పోతున్న తన మెదడుకి బుల్లెట్ దింపి.. ‘ప్రపంచంలోని నాకు… నాలోని ప్రపంచానికి’ అనే లాస్ట్ డైలాగ్‌తో ‘అ!’ థీమ్ మొత్తం చెప్పేసి, కథను ముగించాడు ప్రశాంత్ వర్మ…

ఆమె మరణం, తనలోని పాత్రలన్నింటికీ కూడా మరణమే… అందులో కాజల్ గన్ షాట్ తర్వాత పడిపోగానే తన మెదడులోని ప్రతీ క్యారెక్టర్ కూడా పడిపోతుంది… ఇలాంటి ట్విస్ట్ ఎండింగ్ మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు..

2018లో విడుదలైన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల థియేటర్లు రెండు వారాల పాటు తీవ్రంగా నష్టపోయింది… రిజల్ట్ ఫ్లాప్ అయినా, కంటెంట్‌తో ప్రేక్షకులతో ‘అ!’ అనిపించాడు ప్రశాంత్ వర్మ..

Samantha, Savitri, Silk Smitha : వాడుకుని వదిలేస్తుందా ఫిల్మ్ ఇండస్ట్రీ..!?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post