Aussie Captains From Hyderabad : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్‌కి వెళ్లింది. రాజస్తాన్ రాయల్స్ జట్టుపై ఘన విజయం అందుకుని ఫైనల్‌కి చేరింది హైదరాబాద్ టీమ్. ఇంతకుముందు హైదరాబాద్ టీమ్‌కి రెండు ఐపీఎల్ టైటిల్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ల కెప్టెన్సీలోనే వచ్చాయి. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అప్పుడు హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్..
Hanuma Vihari : ఆంధ్రా క్రికెట్‌లోకి రాజకీయాలు.. కొడుకు కోసం కెప్టెన్‌ని మార్చేసి..
ఆ తర్వాత 2016 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఈసారి కూడా హైదరాబాద్ కెప్టెన్ ఆస్ట్రేలియానే. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. 2018లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది సన్‌రైజర్స్. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్లు చేసిన పనిని, న్యూజిలాండ్ కెప్టెన్ చేయలేకపోయాడు.
మళ్లీ 6 ఏళ్ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరింది. గతంలో హైదరాబాద్‌కి రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించింది ఆస్ట్రేలియన్లే. ఈసారి కూడా హైదరాబాద్ కెప్టెన్ కమ్మిన్స్, ఆస్ట్రేలియావాడే. దీంతో మూడోసారి కూడా ఆస్ట్రేలియా ప్లేయర్ కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు, ఐపీఎల్ గెలవనుందా? మే 26న కెకెఆర్ టీమ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ గెలిస్తే… ఆసీస్ కెప్టెన్, హైదరాబాద్ టీమ్ డెడ్లీ కాంబోగా ఫిక్స్ అయిపోవాల్సిందే.