ఆఖరి ఆటలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాని చిత్తు చేసి ఫైనల్ చేరిన ఆసీస్..

Aus vs SA : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 క్లైమాక్స్ ఫైట్‌ ప్రత్యర్థులు డిసైడ్ అయ్యారు. మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగులతో గెలిచిన టీమిండియా, ఫైనల్‌కి దూసుకెళ్లగా.. రెండో సెమీస్‌లో ఆసీస్, సౌతాఫ్రికాపై గెలిచి ఆఖరి ఆటకు క్వాలిఫై అయ్యింది.

న్యూజిలాండ్‌ని చిత్తు చేసి, వరల్డ్ కప్ ఫైనల్‌‌కి టీమిండియా… అహ్మదాబాద్‌లో ఆఖరి ఆట..

స్పిన్‌కి అనుకూలిస్తున్న ఈడెన్ గార్డెన్స్‌లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 212 పరుగులకి ఆలౌట్ అయ్యింది. డేవిడ్ మిల్లర్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది దక్షిణాఫ్రికా..

లక్ష్యం చిన్నదే కావడంతో ఆసీస్ ఓపెనర్లు 6 ఓవర్లలో 60 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభం అందించారు. అయితే వరుసగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 193/7 పరుగులకి చేరుకుంది.

Aus vs SA

ఈ దశలో కాస్త ఉత్కంఠ రేగినా ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మ్యచ్‌ని ముగించారు. ట్రావిస్ హెడ్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా స్టీవ్ స్మిత్ 30, జోష్ Clothing 28 పరుగులు చేశారు.

నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?

నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post