Ashwini Dutt : ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం వైసీపీకి ఎన్నికల్లో సినీ రంగం సపోర్ట్ కూడా దక్కలేదు. దీనికి కారణం టికెట్ రేట్లను భారీగా తగ్గిస్తూ వైఎస్ జగన్ తీసుకొచ్చిన మార్పులే! హైదరాబాద్‌లో లోయర్ క్లాస్ టికెట్ రేటు రూ.50 ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో అది రూ.10కి వెళ్లింది. ఇక్కడ బాల్కనీ రేటు కనీసం రూ.175 ఉంటే, ఆంధ్రాలో రూ.100కి పడిపోయింది.
ఈ టికెట్ల రేట్లలో వ్యత్యాసాల కారణంగానే తెలంగాణలో సూపర్ హిట్ కలెక్షన్లు కొల్లగొట్టిన చాలా సినిమాలు, ఆంధ్రాలో భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టిన ‘RRR’ సినిమా కూడా ఆంధ్రాలో భారీ లాభాలు తేలేకపోయింది. బ్రేక్ ఈవెన్ సాధించడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమాతో పాటు ‘దసరా’, ‘ఖుషీ’, ‘పుష్ప 1’ ఇలా ఆంధ్రాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నష్టాలు తప్పలేదు.. ఆంధ్రాలో తెలుగుదేశం- జనసేన కూటమి అధికారంలోకి రావడంతోనే సినీ ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరి వచ్చింది..
Kalki 2898 AD Vs Mad Max : కల్కి చూడాలి అనుకునే వాళ్ళు, ఇది చదవకండి..
‘కల్కి 2898AD’ సినిమాకి మంచి హైక్ లభించింది. ఈ విషయంపై స్పందించిన నిర్మాత అశ్వినీదత్ ‘మేం టికెట్ రేట్లు పెంచమని అడగగానే రూ.100 పెంచేందుకు ఓకే అన్నారు. నిజానికి ఆయన నార్త్‌లో మాదిరిగా మల్టీప్లెక్సుల్లో రూ.1000- 1500 రేటు పెట్టుకోమని సలహా ఇచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో అది వర్కవుట్ కాదు.. వచ్చే సోమవారం నుంచి పెంచిన రేట్లు కూడా తగ్గిస్తాం.. ఈ వారం కూడా సినిమాకి కలెక్షన్లు స్టడీగా ఉంటాయనే అనుకుంటున్నాం..’ అంటూ చెప్పాడు అశ్వినీదత్.