Article 370 : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 307 రద్దుని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. ఇది పూర్తిగా కేంద్రం నిర్ణయమని, పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది.
వచ్చే పదేళ్ళలో గౌతమ్ ఆదానీ ₹7 లక్షల కోట్ల భారీ పెట్టుబడి..
దీనిపై సోమవారం వెలువరించిన తీర్పులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టికల్ 370 ఇది అమలులోకి వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత, జమ్మూ మరియు కాశ్మీర్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సోమవారం, డిసెంబర్ 11న సుప్రీంకోర్టు విచారించింది.
ధీరజ్ సాహు ఐటీ దాడులు: 318 కోట్ల నగదు పట్టివేత..
2024 సెప్టెంబర్ 30 లోపు జమ్మూకశ్మీర్, లడఖ్ లలో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఇదిలా ఉండగా.. ఆర్టికల్ 370 తీర్పు దృష్ట్యా జమ్మూ కశ్మీర్ లో కేంద్రం ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా హై సెక్యూరీటీని ఏర్పాటు చేసింది.