Arati Doota : అరటి చెట్టు నుంచి వచ్చే పండ్లే కాదు, దూట కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి దూటలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనo తిన్న ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. అలాగే ఇది మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ అరటి దూట తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ స్టోన్స్ తగ్గుతాయి.
కమ్మనైన కర్ణాటక బిసిబెలే బాత్..
ఓవర్ వెయిట్ తో బాధపడుతున్న వాళ్ళు ఇది మీ డైట్ లో భాగంగా చేసుకుంటే మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ అరటి దూట పెసరపప్పు కూర తయారు చేసుకోవడం ఎలానో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
అరటిదూట (చిన్నది) – ఒకటి
పెసరపప్పు – చిన్న అర గ్లాస్
శనగపప్పు – ఒక చెంచా
మినపప్పు – ఒక చెంచా
ఆవాలు – అర చెంచా
ఎండుమిర్చి – రెండు
జీలకర్ర – కొంచెం
కరివేపాకు – కొన్ని రెబ్బలు
నూనె – పోపుకుసరిపడ
ఉప్పు – రుచికి సరిపడ
తయారీ విధానం :
ముందుగా అరటిదూటను పై పెచ్చు తీసి చిన్న చిన్న చక్రాల్లా తరిగి పీచు లేకుండా చేసి వాటిని చిన్న ముక్కలుగా తరిగి అందులో పెసరపప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఆ తర్వాత దానిని చిల్లులపల్లెంలో నీరు వార్చాలి. తర్వాత పాన్ లో ఆయిల్ వేసి కాగాక అందులో ఎండుమిర్చి, పోపుగింజలు వేసి అవి వేగాక కరివేపాకు, ఉడికిన దూట, పెసరపప్పు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ఉడికిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇది అన్నంలోకి లోకే కాకుండా చపాతీ, పూరిలోకి కూడా సూపర్ కాంబినేషన్..