Arambham Movie Review : సైన్స్ ఫిక్షన్ లవర్స్‌కి స్పెషల్ ట్రీట్..

Arambham Movie Review : ‘C/o కంచెరపాలెం’ మూవీలో నటించిన మోహన్ భగత్ హీరోగా నటించిన మూవీ ‘ఆరంభం’. కొత్త దర్శకుడు అజయ్ నాగ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, సురభి ప్రభావతి ముఖ్యపాత్రల్లో నటించారు. ట్రైలర్‌తోనే మంచి ఆసక్తి క్రియేట్ చేసిన ‘ఆరంభం’ మూవీ, మే 10న విడుదల అయ్యింది.

ఓ కారాగారం నుంచి ఖైదీ తప్పించుకుంటాడు. వేసిన తాళాలు వేసినట్టే ఉంటాయి, గోడలు కూడా పగలకొట్టకుండా ఆ ఖైదీ ఎలా తప్పించుకున్నాడో ఓ పెద్ద మిస్టరీగా మారుతుంది. అసలు ఆ ఖైదీ ఎవరు? అతను ఇంతకుముందు ఏం చేసేవాడు? అతని కథ ఏంటి? హీరో, సైంటిస్టుతో కలిసి చేసిన ప్రయోగాలు ఏంటి? ఆ ప్రయోగాల వచ్చిన రిజల్ట్ ఏంటి? ఇదే ‘ఆరంభం’ మూవీ స్టోరీ..

Krishnamma Movie Review : మాస్ సత్యదేవ్ మార్క్..

మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో మనిషి కంటికి కనిపించని ఓ Empty స్పేస్ ఉంది. ఆ స్పేస్‌లోకి వెళ్లడం ఎలా? వెళ్తే ఏమవుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని తీసుకుని, దాని చుట్టూ కథను అల్లుకున్నాడు డైరెక్టర్.. రాసుకున్న కథను, అంతకంటే అందమైన లొకేషన్లలో అద్భుతమైన విజువల్స్‌తో తెర మీద ఆవిష్కరించగలిగాడు కూడా..

సునిజిత్ ఎర్రమిల్లి అందించిన మ్యూజిక్, ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. మదర్ సెంటిమెంట్‌‌తో పాటు ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే స్క్రీన్ ప్లే కూడా మ్యాజిక్ చేసింది.

డైరెక్టర్ కొత్తవాడు కావడంతో అక్కడక్కడా కొన్ని సీన్స్ లాగినట్టు అనిపిస్తాయి. అది తప్ప, సినిమాలో మైనస్ పాయింట్లు పెద్దగా ఏమీ కనిపించవు. ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీని అవుట్ ఫుట్ చూసిన తర్వాత థియేటర్లలోకి తీసుకొచ్చారు. నిజంగానే ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమానే..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post