రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ ముగిసింది. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగగా, ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 64.93 శాతం పోలింగ్ నమోదైంది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదాబాద్‌లో కేవలం 46 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయ్యింది. భువనగిరిలో అత్యధికంగా 76.47 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలోని 10 నియోజిక వర్గాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం..
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకూ 78.36 శాతం పోలింగ్ నమోదు కాగా మొత్తానికి 82 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అంచనా. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిఠాపురంలో ఏకంగా 85 శాతం పోలింగ్ రిజిస్టర్ అయ్యింది.
ఈస్ట్ గోదావరి జిల్లా కోలంకలో 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఏరియాలో 1800 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి భారీగా పోలింగ్ శాతం పెరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఇప్పటిదాకా కరెక్ట్ పోలింగ్ శాతాన్ని ప్రకటించలేదు..
పోలింగ్ శాతం పెరగడంతో ఆ ప్రభావం ఎవరిపై పడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. జగన్ చేసిన సంక్షేమ పథకాల కారణంగా జనాలు ఎగేసుకొచ్చి వైసీపీకి ఓటు వేశారని ఆ పార్టీ చెప్పుకుంటుంటే… జగన్ ప్రభుత్వం పైన ఉన్న కోపం తోనే కసిగా ఓట్లు వేయడానికి విదేశాల నుంచి వచ్చిన వాళ్లూ ఉన్నారని కూటమి చెబుతోంది. జూన్ 4న రిజల్ట్ వచ్చేవరకూ పెరిగిన ఓటింగ్ శాతం ఎవరిపై ప్రభావం చూపుతుందో చూడాలి..