Apple Coconut Halwa : రోజుకో ఆపిల్ తింటే.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు. అలాగే పచ్చి కొబ్బరి గురించి తెలియని వారందరు. ఈ రెండింటిని మిక్స్ చేసి.. ఆపిల్ కోకనట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం..
కావల్సిన పదార్థాలు :
ఆపిల్: 1
కొబ్బరి తురుము: 1 కప్
డ్రై ఫ్రూట్స్: 20 గ్రాములు
నెయ్యి: 2 టేబుల్ స్పూన్స్
పంచదార: 1 కప్
పాలు : 1 కప్
యాలకలపొడి : కొద్దిగా
Drinking Water : నీళ్లు తాగడం ఒక ఆర్ట్..
తయారీ విధానం :
* ఒక పాన్ తీసుకొని అందులో నీళ్ళు, పాలు, పంచదార, ఆపిల్ తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
* ఇప్పుడు ఈ పాన్ ను స్టౌ మీద పెట్టి, మీడియం మంట మీద కొన్ని నిముషాలు ఉడికించాలి. మొత్తగా పేస్ట్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
* మొత్తం మిశ్రమం చిక్కబడే సమయంలో అందులో డ్రైఫ్రూట్స్ (రఫ్ గా పొడి చేసుకొని లేదా అలాగే) వేసుకొని, బాగా మిక్స్ చేయాలి.
Srimanthudu Controversy : మహేష్ ని కేసు నుంచి తప్పించిన నమ్రత..
* చివరగా కొద్దిగా నెయ్యి వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి.
* ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకలపొడి వేసి మరో సారి మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా నెయ్యి మిక్స్ చేసి తర్వాత మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ అవసరం అనిపిస్తే జోడించుకోవచ్చు.
అంతే.. ఆపిల్ హల్వా రెడీ. ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసి, చెర్రీస్ తో గార్నిష్ చేసి వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయాలి.